
Almonds

విటమిన్ ఇ పుష్కలంగా ఉండే బాదంపప్పు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అలాగే శరీరంలో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే బాదంపప్పును రోజూ తీసుకోవాలి

అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి బాదంపప్పు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది.

బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. దీర్ఘకాలం జీవించాలనుకునే వారికి బాదం ఒక వరంలా భావించవచ్చు.

రోజూ బాదంపప్పు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. గుండె, కండరాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.