
పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక గిన్నెడు పెరుగు తీసుకుంటే.. అంతకు మించిన ఔషధం మరొకటి లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పళ్లు, ఎముకల బలంగా ఉండేందుకు కచ్చితంగా అవసరమైన కాల్షియం పెరుగు నుంచి దొరుకుతుంది. రెగ్యులర్‌గా పెరుగును తీసుకోవడం వల్ల ఎముకల లంగా తయారై ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడతాయి. మలబద్దకం, డయేరియా, ఉబ్బరం లాంటివి లేకుండా చేసేందుకు పెరుగు కీలకం. జీర్ణక్రియ వేగవంతం చేసి ఆహారంలోని పోషకాలను శరీరానికి వేగవంతంగా అందేలా చేస్తుంది పెరుగు.

చర్మ సంరక్షణలో కూడా పెరుగు బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి పోషకాలను అందించి కాంతి వంతంగా, ఆరోగ్యవంతంగా మారుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ, జింక్ చర్మాన్ని సహజంగానే కాపాడుతాయి. దీంతోపాటుగా జుట్టు ఆరోగ్యానికి కూడా పెరుగు మంచిది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లకు న్యూట్రియంట్లు, మినరల్స్ అందించి డాండ్రఫ్‌ను అరికడుతుంది. పెరుగు హెయిర్ కండీషనర్‌గా కూడా ఉపయోగపడుతుంది. హెన్నాతో కలిపి తలకు పెట్టుకోవడం వల్ల జుట్లు రాలడం తగ్గుతుంది.

పెరుగు నుంచి నీరు బయటకు తీసిన తర్వాత ఒక గిన్నె నిండా చల్లని పాలు అందులో పోయాలి. అనంతరం పెరుగును 2-3 గంటలు అలాగే వదిలేయాలి. పెరుగు మొత్తాన్ని బట్టి పాలను వాడాలి. ఈ చిట్కా పెరుగులోని అదనపు పులుపును తొలగిస్తుంది.

కొన్ని పరిశోధనల ప్రకారం పెరుగు ప్రశాంతతో పాటు ఎమోషనల్ కానివ్వకుండా మెదడును సిద్ధం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి యాంగ్జైటీ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ హెల్త్ కోసం ఇది నేచురల్ రెమెడీ కూడా. చాలా వరకు కూడా నోటి ద్వారా వ్యాపించే జబ్బులు బ్యాక్టీరియా వల్లనే కలుగుతాయి. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా ఇతర బ్యాక్టీరియాలను శరీరంలోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది.