- Telugu News Photo Gallery Having these spots on the legs is like having this problem, Check Here is Details
Health: కాళ్లపై ఈ మచ్చలు ఉన్నాయా.. అయితే మీకు ఈ అనారోగ్య సమస్య ఉన్నట్టే!
శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చినా, ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేసినా ముందు వాటి లక్షణాలను బాడీపై చూపిస్తాయి. శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. బాడీలోని విష పదార్థాలను, మలినాలను బయటకు పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాలేయం సరిగా పని చేయకపోతే..
Updated on: Oct 29, 2024 | 1:38 PM

శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చినా, ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేసినా ముందు వాటి లక్షణాలను బాడీపై చూపిస్తాయి. శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. బాడీలోని విష పదార్థాలను, మలినాలను బయటకు పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కాలేయం సరిగా పని చేయకపోతే శరీర ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. కాలేయం దెబ్బతింటే ఆ లక్షణాలు పాదాల్లో కనిపిస్తాయట. వీటిని ప్రారంభ లక్షణాలుగా గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కాలేయంలో ఏర్పడే పిత్తం మరీ మందంగా మారినప్పుడు పాదాల్లో దురదలు అనేవి ఎక్కువగా వస్తాయి. పాదాల్లో భరించలేనంతగా దురద పెట్టినప్పుడు.. రాత్రంతా చికాకు అనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు.

అదే విధంగా పాదాలపై ఎరుపు, గోధుమ రంగు మచ్చలు కనిపిస్తే.. ఇందుకు ఫ్యాటీ లివర్, హైపటైటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్నట్టే. కాలేయం సరిగా పనిచేయనప్పుడు శరీరంలోని వివిధ భాగాలపై ఇలా మచ్చలు కనిపిస్తాయట.

కాళ్లలో గోళ్ల సమస్యలు వచ్చినప్పుడు.. బాగా పుచ్చిపోయినప్పుడు కూడా కాలేయం సమస్య ఉన్నట్టే. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవడం మేలు. అదే విధంగా పాదాల మడమల్లో ఎక్కువగా పగుళ్లు వచ్చినా.. అవి త్వరగా తగ్గకపోయినా.. వైద్యులతో సంప్రదించాలి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)




