
బిస్కెట్లు: చాలా మంది టీతో బిస్కెట్లు లేదా రస్క్‌లు తింటారు. కానీ వీటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో శుద్ధి చేసిన పిండి, ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక చక్కెర ఉంటాయి, ఇవి జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. అలాగే బరువు పెరగడం, గ్యాస్, రక్తంలో చక్కెర స్థాయిలు పెంచడం వంటి అనేక ఆరోగ్య సమస్యలను వస్తాయి. కాబట్టి మీరు టీతో పాటు వీటిని తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.

వేయించిన స్నాక్స్: చాలా మంది వేడివేడి టీతో సమోసాలు లేదా పకోడీలు తినడానికి ఇష్టపడుతారు. వేయించిన స్నాక్స్ ను టీతో కలిపి తినడం చాలా రుచికరంగా ఉన్నప్పటికీ.. ఆరోగ్య పరంగా ఇది అస్సలు మంచిది కాదు. ఇది గుండె, కడుపు రెండింటికీ హానికరం. ఈ స్నాక్స్‌లోని అదనపు నూనె మీ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది దీర్ఘకాలంగా కొనసాగితే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

స్వీట్లు: కొంతమంది టీతో పాటు స్వీట్లను తింటుంటారు. కానీ ఇలా తినడం వల్ల జీర్ణక్రియపై తీవ్ర ప్రభావితం పడుతుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది, ఇది కడుపు సమస్యలు, ఆమ్లతకు కారణమవుతుంది. అలాగే, టీతో పాటు అధిక చక్కెర కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత క్రమంగా పెరుగుతుంది. ఇది ఊబకాయం, మధుమేహం అలసటకు దారితీస్తుంది.

చాక్లెట్: చాక్లెట్, టీ రెండింటిలోనూ కెఫిన్ ఉంటుంది. వాటిని కలిపి తీసుకోవడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది, విశ్రాంతి లేకపోవడం, నిద్ర సమస్యలు వస్తాయి. టీతో చాక్లెట్ తినడం వల్ల నిద్రలేమి వస్తుంది.

టీతో మందులు తీసుకోవడం: మనలో చాలా మంది చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే.. టీతో పాటు మందులు వేసుకుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. టీలోని కెఫిన్, టానిన్లు మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది దుష్ప్రభావాలకు కారణమవుతాయి. కాబట్టి, మందులను ఎల్లప్పుడూ నీటితోనే తీసుకోవాలి.