AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం ధరల్లో భారీ పతనం.. ఇదే జరిగితే దీపావళి నాటికి రూ.లక్షకు డౌన్..?

బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. శనివారం ఏకంగా రూ.4 వేలు తగ్గింది. దీంతో దీపావళి నాటికి బంగారం ధరలు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల మందగమనం, డాలర్ బలోపేతం, పారిశ్రామిక డిమాండ్ తగ్గడం వంటివి దీనికి కారణాలుగా చెబుతున్నారు. పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త.

Venkatrao Lella
|

Updated on: Oct 31, 2026 | 11:55 AM

Share
భారతదేశంలో బంగారంకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మన దేశ ప్రజలు బంగారాన్ని బాగా ఇష్టపడతారు. పండుగలు, పెళ్లిళ్లు, ఏమైనా పంక్షన్లు వచ్చాయంటే చాలు.. శరీరంపై బంగారం ధరించి మురిసిపోతుంటారు. ఇక ఆభరణంగానే కాకుండా ఒక ఆస్తిగా కూడా దీనిని భారతీయులు పరిగణిస్తారు. దీంతో ఆపద సమయంలో ఆర్ధిక రక్షణగా నిలుస్తుందనే కారణంతో గోల్డ్ కొని ఇంట్లో లేదా బ్యాంకుల్లో భద్రపర్చుకుంటారు. ఆర్దికంగా కష్టాలు ఎదురైన సమయంలో తమ వద్ద బంగారాన్ని అమ్మి తమ అవసరాలను తీర్చుకుంటారు.

1 / 5
సాధారణంగా పండగ సీజన్, పెళ్లిళ్ల సీజన్ వస్తుందంటే డిమాండ్ పెరగడం వల్ల బంగారం, వెండి ధరల్లో పెరుగుదల నమోదవుతూ ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల మందగమనం, అమెరికా డాలర్ బలపడుతుండటం, ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణాలతో గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో మొదలైన పతనం కొనసాగుతోంది. ఇదే తగ్గుదల కొనసాగితే రానున్న కొన్ని నెలల్లో తులం బంగారం లక్షకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2 / 5
బంగారం ధరలు అక్టోబర్ 31వ తేదీన భారీగా పడిపోయాయి. తులం బంగారంపై ఏకంగా రూ.4 వేలు తగ్గగా.. సిల్వర్ ఒకేసారి రూ.10 వేలు తగ్గుముఖం పట్టింది. చాలా నెలల తర్వాత ఒకేరోజు కనిష్ట స్థాయికి పడిపోయాయి. 12 నెలల్లోనే ఇదే అత్యత కనిష్ట స్థాయిగా చెబుున్నారు. ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1,27,300కి చేరుకోగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.1,38,880కు పడిపోయింది. ఇదే పరిస్ధితి కొనసాగితే 22 క్యారెట్ల గోల్డ్ రూ.లక్షకు పడిపోయే ఛాన్స్ ఉందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

3 / 5
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పడిపోవటం బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలాగే పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితులు సద్దుమణగడం, గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతులు పెరగటం వంటి అంశాలు కూడా దోహతపడుతున్నాయి. సరఫరా మెరుగుపడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర సుమారు 110 డాలర్లకు పడిపోయింది. ఇండియన్ క్రూడ్ ఆయిల్ బాస్కెట్ ధర కూడా తగ్గిపోయింది.

4 / 5
అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్  బ్యాంక్ భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు డాలర్ బలపడటానికి ఊతమిస్తోంది. డాలర్ బలపడటంతో బంగారం, వెండి ధరలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ధరలు మరింతగా మార్పులు జరిగితే నష్టపోతామనే భయంతో పెట్టుబడిదారులు విక్రయిస్తున్నారు.  దీపావళి నాటికి బంగారం ధరలు సామాన్యులకు మరింతగా అందుబాటులోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బిజినెస్ అనలిస్టులు అంచనాలు వేస్తున్నారు.

5 / 5
Follow Us
ఇదే జరిగితే దీపావళి నాటికి బంగారం రూ.లక్షకు డౌన్..?

బీసీ హాస్టల్‌లో విషాదం.. బాత్రూంలో విద్యార్థి మృతి!

దేశంలో జనాభా లెక్కలకు షెడ్యూల్ రిలీజ్.. ఎప్పటి నుంచంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణజింక గురించి మీకు ఎంత తెలుసు?

సినిమా ఆశ చూపి హత్యలు.. రియల్ స్టోరీతో తెరకెక్కిన మూవీ..

వేడి వల్ల తలనొప్పి వస్తోందా? వెంటనే ఉపశమనం కలిగించే ఈజీ చిట్కాలు

మద్యానికి బానిసై.. ఇండస్ట్రీకి దూరమై..
మద్యానికి బానిసై.. ఇండస్ట్రీకి దూరమై..
బాలింతలకు సాంబ్రాణి పొగ ఎందుకు వేస్తారు?దీని వెనుక ఉన్న కారణాలివే

ఆక్వా రంగంపై అర్నబ్ ఎఫెక్ట్.. కన్నీరుమున్నీరవుతున్న రొయ్యల రైతులు

స్వచ్చమైన వెండిని గుర్తించడం ఎలా..? ఈ సింపుల్ విషయం తెలిస్తే చాలు