
చలికాలంలో పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం అల్లంతో కషాయం, సూప్, టీ చేసుకొని తీసుకోవటం మంచిదని చెబుతున్నారు. అల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అల్లం నీళ్లు కూడా ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి, ఇది నొప్పి నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది.

కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు గ్యాస్, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యలతో పోరాడుతున్నట్లయితే, అల్లం మీకు దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు. అల్లం మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

శీతాకాలంలో మన రోగనిరోధక శక్తి తరచుగా బలహీనపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో అల్లం అమృతం కంటే తక్కువ కాదు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు అల్లంలో పుష్కలంగా ఉన్నాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు శీతాకాలంలో ప్రతిరోజూ అల్లం తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లం తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీని కోసం మీరు అల్లం టీ తాగవచ్చు.

అల్లం రసంను నిత్యం సేవిస్తే రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పి, వాపులను తగ్గించడంలో అల్లం సమర్థవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ అల్లంను తగిన మోతాదులో తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.