
సరిపడ నీరు తాగని కారణంగా కూడా జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు, గ్యాస్ వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కచ్చితంగా సరిపడ నీటిని తీసుకోవాలి. వాతావరణం చల్లగా ఉందని కొందరు నీటిని తాగడం మానేస్తుంటారు. కానీ దాహంతో సంబంధం లేకుండా కచ్చితంగా రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఆహారంలో పండ్లు, కూరగాయలను కచ్చితంగా భాగం చేసుకోవాలి. ఇలాంటి ఫుడ్‌ను నిత్యం తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. కడుపు నిత్యం లైట్‌గా ఉంటుంది. త్వరగా జీర్ణమై కడుపు ఉబ్బరం వంటి సమస్య దరిచేరదు. ఇక జీర్ణవ్యవస్థ మెరుగుపడి, గ్యాస్ సమస్యలు తగ్గాలంటే క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలని నిపునులు చెబుతున్నారు. వ్యాయామంతో శరీరం ఫిట్‌గా ఉండడమే కాకుండా, జీర్ణ సమస్యలు కూడా దరచేరవు.

మనలో చాలా మంది ఆహారం తీసుకునే సమయంలో చేసే తప్పు.. భోజనాన్ని త్వరగా నమిలి మింగేయడం. ఇలా చేయడం వల్ల కూడా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆహారాన్ని వీలైనంత ఎక్కువసార్లు నమిలి మింగాలి. ఇలా చేస్తే ఆహారం త్వరగా జీర్ణమై గ్యాస్ సమస్య దరిచేరదు.

ఒత్తిడి కూడా జీర్ణ సంబంధిత సమస్యకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే పనులు చేయాలి. ఇందుకోసం యోగా, మెడిటేషన్ వంటి వాటిని కచ్చితంగా జీవనశైలిలో ఒక భాగం చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యం మెరుగవుతుంది.

గ్యాస్ సమస్య నుంచి బయటపడాలంటే కచ్చితంగా పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజూ పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలోపేతమవుతుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.