
ప్రతి రోజూ ఏదో ఒక పండు అయినా తినాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు. కానీ మనం పెద్దగా పట్టించుకోం. కేవలం ఆరోగ్యం బాలేనప్పుడు మాత్రమే తింటూ ఉంటాం. కొంత మంది మాత్రం అదే పలంగా ఫ్రూట్ జ్యూసులు తాగుతూ ఉంటారు. ఫ్రూట్స్ తింటే మంచిదా! లేక ఫ్రూట్ జ్యూసులు తాగితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజువారీ ఆహారంలో కనీసం ఒక పండైనా ఉండటం మేలు. పండ్లలో అనేక విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు లభిస్తాయి. దీంతో శరీరంలో లోపల, బయట కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పండ్ల తినడం వల్ల నేరుగా పోషకాలు అందుతాయి.

జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది. బీపీ, షుగర్ వంటివి త్వరగా రాకుండా ఉంటాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

బరువు తగ్గడానికి ప్రయత్నించేటప్పుడు పండ్ల రసాలు అస్సలు తాగకూడదు. పండ్ల రసాలలో ఫైబర్ ఉండదు. పూర్తి కేలరీలు, చక్కెర ఉంటాయి. అందువల్ల ద్రవాలకు పండును యథాతథంగా తినడం మంచిది.

కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తీవ్రంగా బరువు కూడా పెరుగుతారు. ఆకలి కూడా పెరుగుతుంది. కాబట్టి ఫ్రూట్ జ్యూసుల కంటే.. నేరుగా పండ్లు తినడమే ఆరోగ్యానికి మంచిది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)