
ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ముందు మీ వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో కాస్త సమయం కూడా దొరకడం లేదు. ఈ హడావిడిలో వంట గదిలోని వస్తువులను చిందర వందరగా చేస్తూ ఉంటారు. దీని వల్ల మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది. కిచెన్ చిందర వందరగా ఉంటే.. మీకు గందరగోళంగా ఉంటుంది. అలా కాకుండా ఈ చిట్కాలు పాటిస్తే.. మీ కిచెన్ ఎప్పుడూ నీటిగా ఉంటుంది.

మీరు వంటకు ఉపయోగించే వంట సరుకుల డబ్బాలు తీస్తూ ఉంటారు. వాటి అవసరం తీరాక.. మళ్లీ వాటిని తీసిని ప్రదేశంలోనే వెంటనే పెట్టేయండి. దీని వల్ల మీకు చిందర వందరగా ఉండదు. ఎప్పటికప్పుడు గ్యాస్ కట్టును శుభ్రం చేస్తూ ఉండాలి.

కూరగాయలు కట్ చేశాక చాలా మంది ఆ చెత్తను.. గ్యాస్ కట్టుపైనే వదిలేస్తారు. దీంతో అక్కడికి బ్యాక్టీరియా, క్రిములు, బొద్దింకలు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ చెత్తను క్లీన్ చేస్తూ ఉండాలి. కిచెన్‌లో ప్రత్యేకంగా ఓ డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకోండి.

మీరు ఉపయోగించే ఫ్రిజ్, మైక్రోవేవ్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచేలా చూసుకోండి. మీ అవసరం తీరాక వాటిని వెంటనే శుభ్రం చేసేయండి. ఫ్రిజ్‌లో అవసరం లేని ఆహారాలను నిల్వ చేయకూడదు. ఎప్పటికప్పుడు వాటిని తీసి పారేస్తూ ఉండండి.

అదే విధంగా చాలా మంది వంట గదిలో అవసరం లేని వస్తువులను పెడుతూ ఉంటారు. దీని వల్ల వంట గది ఇరుకుగా ఉండొచ్చు. అవసరం లేని వస్తువులను వంట గది నుంచి తీసేయండి. వీలైనంత వరకూ కిచెన్ ఖాళీగా ఉండేలా చూసుకోండి. దీని వల్ల మీకు ప్రశాంతంగా ఉంటుంది.