
Hangover

చాలా మంది ఈ హ్యాంగోవర్ భయంతో తాగరు. అయితే పార్టీలో చాలా మంది అతిగా తాగడం వల్ల ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుంది. కొంచెం నిమ్మకాయ రసం తాగితే గానీ హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలుగదు. కానీ రోజంతా ఒక విధమైన మత్తు అనుభూతి ఉంటుంది.

హ్యాంగోవర్‌ను సులభంగా వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ముందుగా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. హ్యాంగోవర్ సమయంలో శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి. కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసం కూడా త్రాగవచ్చు.

హ్యాంగోవర్ ఉంటే ఆ రోజు ఉదయం తీపి ఏమీ తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇది సమస్యను మరింత పెంచుతుంది. అల్లం టీ వికారం, కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి టీ తయారు చేసుకుని త్రాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి విశ్రాంతినిస్తుంది. ఇందులో కూడా పంచదార వేయకపోవడమే మంచిది.

హ్యాంగోవర్ సమయంలో శరీరానికి శక్తి కోసం ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ అవసరం. కాబట్టి ఆ రోజు మొత్తం గుడ్లు, పెరుగు, ఇతర ప్రోటీన్ ఫుడ్స్ తినాలి. అవి శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.