
శీతా కాలంలో ఆరోగ్య పరంగా, చర్మ పరంగా చాలా చేంజస్ వస్తాయి. బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అలాగే రోగాలు ఎక్కువగా అటాక్ చేస్తాయి. అంతే కాకుండా శీతా కాలంలో తిన్న ఆహారం త్వరగా అరగదు.. దీంతో జీర్ణ సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇక చర్మం సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చలి కాలం వచ్చిందంటే చాలు.. చర్మం పొడి బారడం, నిర్జీవంగా మారి పోతుంది. ఇంకొంత మందికి అయితే స్కిన్ టోన్ కూడా మారి పోతుంది. అలాగే దురద, ఇన్ ఫెక్షన్స్ కూడా వస్తాయి. చలి పెరిగే కొద్దీ ఈ సమస్య పెరుగుతుంది.

చలి కాలంలో ఈ సింపుల్ టిప్ప్ ఉపయోగిస్తే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచు కోవచ్చు. శీతా కాలంలో చర్మం పొడి బారుతుంది. దీంతో ఎంతో కాస్ట్ లీ అయిన ప్రాడెక్ట్స్ మాయిశ్చ రైజర్స్ ఉపయోగిస్తారు. నిజానికి ఇవి కొనాల్సిన అవసరం లేదు. మరి ఇంట్లోనే ఈజీగా పాటించే టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

చలి కాలంలో ప్రతి రోజూ ముఖానికి స్టీమ్ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల స్కిన్ ఫ్రెష్ గా ఉంటుంది. అంతే కాకుండా రెస్పిరేటరీ ఇన్ ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. అలాగే స్కిన్ హైడ్రేట్ గా ఉంటుంది. పొడి బారడం తగ్గుతుంది.

స్నానానికి వెళ్లే ముందు తప్పనిసరిగా కొబ్బరి నూనెతో బాడీ మొత్తం మర్దనా చేసుకోండి. ఆ తర్వాత సున్ని పిండితో కానీ సబ్బుతో కానీ స్నానం చేస్తే పొడి బారడం తగ్గుతుంది. అలాగే ప్రతి రోజూ స్నానం చేసేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. దీని వల్ల శరీరంపై ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ ఉన్నా తగ్గుతాయి.

అలాగే పాదాల కేర్ కోసం వారంలో ఒక సారైనా వేడి నీటిలో నిమ్మ రసం, ఉప్పు వేసి అందులో ఓ 15 నిమిషాల పాటు ఆ నీటిలో ఉంచాలి. ఇలా చేస్తే బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే నీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీంతో బాడీ హైడ్రేట్ గా ఉంటుంది.