Tamil Nadu: తమిళనాడులో మరోసారి ఫ్లూ వైరస్ దడ.. ఎక్కడికక్కడ ఫీవర్ క్యాంపులు..
తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వైరల్ ఫీవర్ బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. పలు జిల్లాల్లో జ్వరం బారిన పడుతున్న వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో, అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ ఫీవర్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై.. కోవిడ్ మాదిరిగానే ఆదేశాలను పాటించాలని జిల్లా అధికారులు కోరారు.