
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది దివ్యౌషధంగా చెబుతారు.. మీ చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే మీరు మీ ఆహారంలో మునగను తప్పక చేర్చుకోవాలి. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే పిత్తాశయం పనితీరును ప్రోత్సహించడంలో మునగ ఎంతగానో సహాయపడుతుంది. మునగతో డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు.

మునగలో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా ఇది దగ్గు, జలుబు వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. మునగ ఎముక సాంద్రతను మెరుగుపరుస్తుంది. మునగకాయలో బలమైన ఎముకలకు అవసరమైన కాల్షియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి.

మునగలో అనేక వ్యాధులను తగ్గించే శక్తి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. నియాసిన్, రిబోఫ్లేవిన్ మరియు విటమిన్ బి12 వంటి ఇతర బి విటమిన్లు కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మునగలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

మునగ కాయలు తరచూ తినడం వల్ల థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. మునగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. మునగలో ఉండే పోషకాలు రక్తనాళాలలో చెడు కొలస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తాయి. దీన్ని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

మునగ చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ వంటి పలు పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. మొటిమలను తొలగిస్తుంది. యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. కంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది. మునగ సూప్ తీసుకోవటం వల్ల క్రమంగా బరువు తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.