కలబందలో అలోసిన్ ఉంటుంది. ఇది చర్మాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటిసెప్టిక్ చర్మం మంటను నివారిస్తుంది. 3 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, 2 టేబుల్ స్పూన్ల తేనె, 1 టీస్పూన్ పసుపు పొడిని కలుపుకుని, ముఖం, చేతులు, మెడ చర్మంపై అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడగాలి. దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించడం వల్ల టాన్ రిమూవల్‌లాగా పని చేస్తుంది. పండిన బొప్పాయి, తేనె, నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి అప్లై చేసుకోకున్నా మంచి ఫలితం ఉంటుంది.