Elephant Care Center: ప్రకృతి ఒడి నుంచి జనావాసాల్లోకి వచ్చి వ్యాధుల బారిన పడుతున్న ఏనుగులు.. సంరక్షణ కోసం ఎన్జీవో సంస్థ కృషి

|

Jan 06, 2023 | 1:07 PM

తమ జీవితంలో మనుషుల కోసం కష్టపడి గాయపడిన జంతువులు.. ఇలాంటి జంతువులను తీసుకొచ్చి ఓదార్చి వాటిని సంరక్షించి కొత్త స్ఫూర్తిని నింపుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి తొలి సంరక్షణ కేంద్రం ఏర్పడింది. ఇక్కడ ఏ జంతువును సంరక్షిస్తున్నారు? ఎవరి సాయం అందిస్తున్నారు పూర్తి వివరాలు మీకోసం 

1 / 11
కర్ణాటకలో మొట్టమొదటిగా ఏనుగు సంరక్షణ కేంద్రం కోలార్‌ జిల్లా సమీపంలోని కాజికల్లహళ్లి గ్రామంలో.. బెంగళూరుకు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఏనుగుల సంరక్షణ కోసం కృత్రిమ సరస్సు నిర్మాణం, వెదురు పెంపకం, గడ్డి పెంపకంతో పాటు అనేక  సదుపాయాలు ఉన్నాయని జిల్లా అటవీ సంరక్షణాధికారి ఏడుకొండల చెప్పారు. 

2 / 11
ఏనుగులు స్నానం చేయడం, ఏనుగులను చూసుకోవడం, ఏనుగులు తమ శరీరాలపై నీరు జల్లుకుంటూ ఆనందించడం.. బురదలో దొర్లుతూ ఆస్వాదించడం వంటి అనేక ఈ దృశ్యాలు దొడ్డాయూరు గ్రామ సమీపంలో నిర్మించిన ఏనుగు సంరక్షణ కేంద్రంలో కనిపిస్తాయి. 

3 / 11
ప్రకృతికి దగ్గరగా అడవిలో సంతోషంగా జీవించాల్సిన ఏనుగులు ప్రస్తుతం.. సభ్య సమాజంలో జీవిస్తూ.. అనేక కష్టనష్టాలకు గురై రోగాల బారిన పడుతున్నాయి. దీంతో ఏనుగుల సంరక్షణ కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏనుగుల సంరక్షణకు ఇద్దరు వైద్యులు, ఐదుగురు మహౌట్‌లు, ఇద్దరు సూపర్‌వైజర్లు, భద్రతా సిబ్బందితో సహా మొత్తం 9 మంది సిబ్బంది ఉన్నారు.

4 / 11
అనీషా, దుర్గ అనే ఏనుగులు కీళ్లనొప్పులు, మధుమేహంతో బాధపడుతున్నాయి. అలా వారానికి రెండు మూడు సార్లు డాక్టర్ కూడా వచ్చి పరీక్షలు నిర్వహించి ఆయన సలహా మేరకు మందులు, చికిత్స అందిస్తారు. రోజుకు రెండుసార్లు ఏనుగులకు స్నానం చేయిస్తారు.  ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయిస్తారు. 

5 / 11
Elephant Care Center: ప్రకృతి ఒడి నుంచి జనావాసాల్లోకి వచ్చి వ్యాధుల బారిన పడుతున్న ఏనుగులు.. సంరక్షణ కోసం ఎన్జీవో సంస్థ కృషి

6 / 11
ఏనుగుల సంరక్షణ కేంద్రానికి కావాల్సిన మౌలిక వసతులను సుమారు కోటి రూపాయలతో ఏర్పాటు చేయడంతో పాటు ఏనుగుల సంరక్షణ కేంద్రం నిర్వహణను డబ్ల్యూఆర్‌ఆర్‌సీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది.

7 / 11
ఇక్కడ కృత్రిమ సరస్సు నిర్మాణం, వెదురు పెంపకం, గడ్డి పెంపకంతో పాటు అనేక వ్యవస్థలున్నాయని జిల్లా అటవీ సంరక్షణాధికారి ఏడుకొండల చెబుతున్నారు. ఏనుగులను సంతోషంగా ఉంచడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం ద్వారా ఏనుగులకు కొత్త జీవితాన్ని ఇస్తున్నట్లు చెప్పారు.

8 / 11
అవును.. రాష్ట్రంలోనే తొలి అటవీ శాఖ ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ప్రస్తుతం గౌరి, దుర్గ, జానుమణి, అనీషా అనే నాలుగు ఏనుగులు  ఉన్నాయి. అనీషా తమిళనాడుకు చెందినది, దుర్గ బెంగళూరుకు చెందినది. జానుమణిని గోవా నుంచి తీసుకురాగా, గౌరీని నంజన్‌గూడ నుంచి తీసుకువచ్చారు. 

9 / 11
వృద్ధాప్యం లేదా అనేక వ్యాధులతో బాధపడుతున్న ఏనుగులను.. దేవాలయాలు, రిసార్టులతో పాటు పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నారు.

10 / 11
ప్రస్తుతం ఏనుగుల సంరక్షణ కేంద్రంలో నాలుగు ఏనుగులు ఉన్నాయని, త్వరలో మరిన్ని ఏనుగులు వచ్చే అవకాశం ఉందన్నారు.

11 / 11
అందుకే ఇక్కడ పది ఏనుగులకు సరిపడా ఇళ్లు, సౌకర్యాలను అటవీశాఖ నిర్మిస్తోంది.