Diabetes: ఎలక్ట్రిక్ సైకిల్‌తో టైప్2 డయాబెటిస్ తగ్గుతుందా.? పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..
మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల డయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా శారీరక శ్రమ తగ్గడం వల్ల టైప్2 డయాబెటిస్ బారిన పడుతోన్న వారు ఎక్కువ అవుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఉపయోగించడ వల్ల టైప్2 డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది..
Updated on: Oct 24, 2023 | 11:56 AM

సైకిల్ తొక్కడం మంచి వ్యాయాయమనే విషయం తెలిసిందే. అయితే స్కూటర్లు, బైక్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సైకిల్ తొక్కే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. దీంతో శారీరక శ్రమ పూర్తిగా లేకుండా పోతోంది. అయితే టైప్2 డయాబెటిస్‌తో బాధపడేవారికి వ్యాయామమే మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ సైకిల్ ఉపయోగించే వారు టైప్ 2 డయాబెటిస్ నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. దీనికి పరిశోధకులు ఒక లాజిక్ చెబుతున్నారు. టైప్2 డయాబెటిస్ బాధితులు వ్యాయామం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే ఎలక్ట్రిక్ సైకిల్ ఉపయోగిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని అధ్యయనం చెబుతోంది.

ఎలక్ట్రిక్ సైకిల్ రెండు రకాలుగా పనిచేస్తుందనే విషయం తెలిసిందే. సాధారణంగా కాళ్లతో తొక్కే సైకిల్‌లాగా ఉపయోగిస్తూనే మరోవైపు, బ్యాటరీ సహాయంతో పనిచేసే ఎలక్ట్రిక్ సైకిల్‌గానూ పనిచేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సాధారణ సైకిల్‌తో పోల్చితే ఎలక్ట్రిక్ సైకిల్ ప్రజలను సైక్లింగ్ చేయడానికి ఎక్కువ ప్రేరేపిస్తుందని చెబుతున్నారు.

కాసేపు కరెంట్‌తో సైకిల్‌ను నడిపించినా కొన్ని సందర్భాల్లో పైడిల్ తొక్కుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో సహజంగానే వ్యాయామం చేసినట్లు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 'ఇ-సైక్లింగ్' ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో డైటింగ్, ఇతర వ్యాయామాల కంటే సులభమైన మార్గమని అధ్యయనంలో తేలింది.

ఇక కండరాల సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా 'ఇ-సైక్లింగ్' ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. పెడల్ అసిస్ట్ రోగనిరోధక శక్తిని పెంచుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.




