Moong Dal: ఈ ఆరోగ్య సమస్యలున్నవారికి పెసలు విషంతో సమానం.. జాగ్రత్త సుమా..

Updated on: Sep 18, 2025 | 4:36 PM

పెసలు మంచి ప్రోటీన్ మూలం. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే పెసలు కొంతమందికి హానికరం కావచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు వీటిని తింటే ఆ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. అందువల్ల ఏ ఆరోగ్య సమస్యలున్నవారు పెసలు తినకూడదు అనేది తెలుసుకోవడం ముఖ్యం.

1 / 6
పప్పుధాన్యాలు ఎల్లప్పుడూ ప్రోటీన్ మంచి వనరుగా పరిగణించబడుతున్నాయి. చాలా మంది తమ శరీరాలను బలోపేతం చేసుకోవడానికి పప్పులను తమ ఆహారంలో చేర్చుకుంటారు. అటువంటి పప్పులలో పెసర పప్పు ఒకటి. ఇది ప్రోటీన్ నిధిగా పరిగణించబడుతుంది. శక్తిని అందించడానికి అనారోగ్య సమయంలో తరచుగా తింటారు. పెసలు సాధారణంగా అన్ని పప్పు ధాన్యాలలో ఆరోగ్యకరమైనవి. సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. అయితే పోషకాలు అధికంగా ఉండే ఈ పప్పు కూడా చాలా మందికి హానికరం అని మీకు తెలుసా? అవును ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసలు కొందరికి విషపూరితం కావచ్చు. అందువల్ల, ఏ వ్యక్తులు పెసలు హానికరమో తెలుసుకోవడం ముఖ్యం.  ఏ సమస్యలున్నవారు పెసర్లు తినొద్దు తెలుసుకోండి..

2 / 6
లో షుగర్ బాధితులు: కొంత మంది తరచుగా షుగర్ డౌన్ అయ్యే సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు పెసలను తినకుండా ఉండాలి. ఈ పెసర పప్పులో  రక్తంలో చక్కెరను తగ్గించే కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. తక్కువ రక్త చక్కెర స్థాయిలు అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

3 / 6
అధిక యూరిక్ యాసిడ్ ఉన్న వ్యక్తులు: ఎవరైనా అధిక యూరిక్ యాసిడ్ స్థాయితో ఇబ్బంది పడుతుంటే.. పెసలు తినొద్దు. ఈ పెసర పప్పులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది అధిక యూరిక్ యాసిడ్ స్థాయి  ఉన్నవారికి హానికరం. కనుక యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వ్యక్తులు పెసలను తక్కువగా తినడం మంచిది.

4 / 6

కిడ్నీలో రాళ్ళు: మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే పెసలు, పెసర పప్పుని తినవద్దు. పెసల్లో ఆక్సలేట్‌లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. కనుక మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉంటే పెసలు తినొద్దు.

5 / 6
గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్య: పెసలు లేదా పెసర పప్పుని ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో గ్యాస్ , కడుపు ఉబ్బరం వస్తుంది. అంతేకాదు కొన్ని సార్లు పచ్చి పెసర మొలకలు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పికి కారణమవుతాయి. అయితే ఈ సమస్యలను నివారించడానికి పెసలను బాగా నమిలి తినాలి.

6 / 6
ఎవరు పెసర మొలకలు తినకూడదంటే: పైన పేర్కొన్న సమస్యలతో పాటు మరికొందరు కూడా పెసలను  ముఖ్యంగా పెసర మొలకలను తినొద్దు. ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రోన్కైటిస్, సైనసిటిస్ లేదా స్పాండిలైటిస్‌తో బాధపడేవారు పచ్చి పెసలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇలా పచ్చి పెసలు లేదా పెసర మొలకలు తినడం వలన శరీరంలో కఫం పెరుగుతుంది. ఇది ఆరోగ్య పరిస్థితులను మరింత దిగజార్చుతుంది