రాత్రి భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోండి..! ఎన్ని లాభాలో తెలిస్తే ఏ స్వీటు ముట్టుకోరు..!!

Updated on: Jul 21, 2025 | 8:42 AM

ఇటీవలి కాలంలో చక్కెర వినియోగం బాగా తగ్గిపోయింది. చక్కెరకు బదులుగా చాలా మంది బెల్లాన్ని ఉపయోగిస్తున్నారు. బెల్ల తినడం వల్ల శరీరానికి చక్కెర కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. ప్రతిరోజూ రాత్రి భోజనం తరువాత చిన్న బెల్లం ముక్క తినడం వల్ల శరీరానికి అమృతంలా పనిచేస్తుందని అంటున్నారు. రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి కడుపు సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట చిన్న బెల్లంముఖ్క తినడం వల్ల జలుబు, దగ్గు, కఫం వంటి వ్యాధులు కూడా తగ్గుతాయని అంటున్నారు. అంతేకాదు.. గ్లాస్‌ పాలలో బెల్లం వేసుకుని తాగితే శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయని అంటున్నారు.

2 / 5
Jaggery

Jaggery

3 / 5
రోజూ బెల్లం తినడం వల్ల అనేక జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. బెల్లంలో ఉండే సహజమైన ఎంజైములు, ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది పేగుల పనితీరును ప్రోత్సహించి, అసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 5
బెల్లం ఐరన్‌కు మంచి మూలం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు, రక్తహీనతతో బాధపడేవారు ఖచ్చితంగా బెల్లం తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు..బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , ఖనిజాలు శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలను దరిచేరకుండా చేస్తుంది.

5 / 5
చర్మ సౌందర్యానికి కూడా బెల్లం చాలా మంచిది. ప్రతిరోజూ కొద్దిగా బెల్లం తినడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి బెల్లం ఔషధంగా పనిచేస్తుంది. మలబద్ధకం నివారించడానికి రాత్రి పడుకునే ముందు బెల్లం తినడం ఈ రోజు నుండే ప్రారంభించండి.