
ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన వాటిల్లో ఫైబర్ కూడా ఒకటి. ప్రతిరోజూ ఎన్నో రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. తిన్న ఆహారం జీర్ణం కావాలన్నా, చక్కెర నిల్వలు అదుపులో ఉండాలన్నా పీచు పదార్థాలు చాలా అవసరం. ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

Fiber food

పండ్లలో ఏమి తీసుకున్నా పీచు పదార్థంతో పాటు పోషకాలు కూడా ఎక్కువగానే లభిస్తాయి. పాప్ కార్న్‌లో కూడా ఫైబర్ మెండుగా ఉంటుంది. అందుకే పాప్ కార్న్ కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.

అదే విధంగా సబ్జా గింజలు, చియా సీడ్స్‌లో కూడా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, ప్రోటీన్స్ వంటివి లభ్యమవుతాయి. గోధుమ పిండి, రాజ్మా, బొబ్మర్లు, కాబోలి శనగలు, బార్లీ వంటి వాటిల్లో కూడా పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

అలాగే అరటి పండ్లు, యాపిల్, ఆరెంజ్, క్వినోవా, క్యారెట్లు, బీట్ రూట్, చిలగడ దుంపలు, కాలే, దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్, తృణ ధాన్యాలు, అవిసె గింజలు, ఆకు కూరలు, బంగాళ దుంపలు, ఓట్స్, బ్రొకలీ కూడా పీచు పదార్థాలు మెండుగా ఉంటాయి.