- Telugu News Photo Gallery Eating and drinking these foods will turn your hair white, check here is details
White Hair Causes: వీటిని తిన్నా, తాగినా మీ జుట్టు తెల్లగా మారిపోతుంది..
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో తెల్ల జుట్టు కూడా ఒకటి. చిన్న వయసులోనే చాలా మందికి నల్లగా ఉండే జుట్టు కాస్తా తెల్లగా మారిపోతూ ఉంటుంది. దీని వలన నలుగురిలో బయటకు తిరిగేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తిన్నా, తాగినా జుట్టు తెల్లగా మారిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా జుట్టు అనేది తెల్లగా మారిపోతుందని నిపుణులు..
Updated on: Sep 27, 2024 | 5:37 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో తెల్ల జుట్టు కూడా ఒకటి. చిన్న వయసులోనే చాలా మందికి నల్లగా ఉండే జుట్టు కాస్తా తెల్లగా మారిపోతూ ఉంటుంది. దీని వలన నలుగురిలో బయటకు తిరిగేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తిన్నా, తాగినా జుట్టు తెల్లగా మారిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా జుట్టు అనేది తెల్లగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్యాక్ చేసిన ఆహారాలు ఎక్కువగా తిన్నా చిన్న వయసులోనే జుట్టు తెల్ల బడిపోతుంది.

టీ, కాఫీలను తరచుగా తీసుకుంటూ ఉంటారు. అయితే మోతాదుకు మించి ఎక్కువ సార్లు టీ, కాఫీలు తాగే వారిలో కూడా తెల్ల జుట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వీటిల్లో ఉండే కెఫిన్.. శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. దీంతో జుట్టు నల్లగా మారుతుంది.

ఈ మధ్య కాలంలో వేయించిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. వేయించిన ఫుడ్స్‌లో పోషకాలు అనేవి ఎక్కువగా ఉండవు. వీటిని తినడం వల్ల సరైన పోషకాలు అందక జుట్టు తెల్లగా మారుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.

అదే విధంగా ఉప్పు, చక్కెర వంటి వాటితో తయారు చేసిన ఆహారాలు తీసుకున్నా కూడా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వీటిని ఎక్కువగా తింటే ఎంత నల్లగా ఉన్న జుట్టు అయినా సరే తెల్లగా మారిపోతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




