
Raisins

పిస్తా పప్పులు: ఈ పప్పులో జింక్ అధికంగా ఉంటుంది. వీటిలో విటమిన్ బి 6 ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతోంది. వీటిలో సెలీనియం యాంటీఆక్సిడెంట్‍గా పని చేస్తోంది. ఇది కణాలు దెబ్బతినకుండా కాపాడుతోంది. వీటిలో జింక్.. వైరల్ ఇన్ఫెక్షన్లనే కాదు.. వాటి తీవ్రతను సైతం తగ్గిస్తుంది. వీటిలో ఏఎండీ.. కంటిశుక్లాలు, కళ్ళపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా కంటి దృష్టిని కాపాడుతుంది. పిస్తాపప్పులో పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు రోగనిరోధక కణాల కార్యకలాపాలను పెంచుతుంది. ఇందులోని ప్రీ బయోటిక్ లక్షణాలు పేగులోని బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఇది శ్లేష్మ పొర రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Walnuts

బాదం: బాదం పప్పులోని మోనోశాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బాదం పప్పులోని ఫైబర్, ప్రోటీన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తాయి, తద్వారా బరువు నియంత్రణకు సహాయపడతాయి. ఇందులోని విటమిన్ E అధిక మొత్తంలో, బాదం పప్పు చర్మాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బాదం పప్పులోని విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. బాదంలోని కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలను బలపరుస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో బాదం తినడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఖర్జూరం: ఖర్జూరాల్లోని ఫైబర్, విటమిన్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటూ పొట్టను శుభ్రం చేస్తాయి. ఖర్జూరాలు విరివిగా తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఖర్జూరాలు ఎంతో సాయపడతాయి. ఖర్జూరాల్లోని కాల్షియం, ఫాస్పరస్, వంటి ఖనిజాలు ఎముకల వ్యాధులను దూరం చేస్తాయి. నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల ఎసిడిటీ కంట్రోల్లో ఉంటుంది. చర్మం, జుట్టు సంరక్షణలో కూడా ఖర్జూరాలు ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఖర్జూరాల్లోని ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఖర్జూరంలో విటమిన్ డి కంటెంట్ వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. మీరు రోజంతా ఉత్సాహంగా ఉండాలనుకుంటే, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం ప్రారంభించాలి.