
భారత వైమానిక దళానికి మొదటి బెంగాలీ ఎయిర్ మార్షల్ సుబ్రతా ముఖర్జీ 1960లో జపాన్‌లోని టోక్యోలోని ఓ రెస్టారెంట్‌లో ఆహారం తింటూ మరణించారు. అలాగే మాజీ US అధ్యక్షుడు జార్జ్ బుష్ ఆహారం తినేటప్పుడు పొలమారి ఉక్కిరిబిక్కిరై మరణించారు. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. చాలా మంది ఆహారం తినేటప్పుడు గొంతులో ఆహారం ఇరుక్కుని పొలమారుతుంది. ఇది ఏమంత సమస్యకాదని భావించేవారే అధికం. ఇలాంటి సందర్భాల్లో ఆహారం గొంతులో ఇరుక్కుపోయి మరణం కూడా సంభవిస్తుంది.

ఆహారం శ్వాసనాళాల్లో అడ్డుపడటం వల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. దీనినే అస్ఫిక్సియా అంటారు. శ్వాసనాళాలు పూర్తిగా మూసుకుపోయినప్పుడు, ఆక్సిజన్ లేకపోవడం వల్ల గుండె, మెదడు పనిచేయడం మానేస్తాయి. దీంతో పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. శాస్త్రీయ భాషలోదీనిని అనెక్సియా అంటారు.

అందుకే తినే సమయంలో ఆహారం గొంతులో ఇరుక్కుపోవడాన్ని తేలికగా తీసుకోకూడదు. బదులుగా ఆహారం లేదా మరేదైనా వాయుమార్గంలో చిక్కుకుపోయినట్లయితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. అనంతరం దగ్గు, గురక, వికారం, అస్పష్టమైన మాటలు, స్పృహ కోల్పోవడం జరుగుతుంది.

7 నుండి 12 నిమిషాల్లో చికిత్స ప్రారంభించకపోతే రోగిని రక్షించడం కష్టం. 1974లో అమెరికన్ థొరాసిక్ సర్జన్ హెన్రీ J. హీమ్లిచ్ గొంతులో చిక్కుకున్న ఆహారానికి తక్షణ చికిత్స చేసే హేమ్లిచ్ మ్యాన్యువర్ అనే ప్రక్రియను కనుగొన్నాడు.

హేమ్లిచ్ మ్యాన్యువర్ అంటే.. ఆహారం గొంతులో చిక్కుకుపోయినప్పుడు వీపు మీద తట్టడం ద్వారా రోగిని ప్రమాదం నుంచి రక్షించవచ్చు. అలాగే రోగిని వెనుక నుంచి పట్టుకుని రెండు చేతులను తీసుకుని, అతని కడుపు, పక్కటెముకలపై గట్టిగా పట్టుకుని వీపుపై తట్టాలి. అప్పుడు గొంగులో ఇరుక్కున్న ఆహారం నోటి ద్వారా బయటకు వస్తుంది. ఈ విధంగా చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు. అయితే హేమ్లిచ్ మ్యాన్యువర్ పద్ధతిని ఏడాది వయసున్న శిశువు, గర్భిణీ మహిళలపై ఉపయోగించకూడదు. అవసరమైతే, వారిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాలి.