
వేసవి కాలం వచ్చిదంటే.. ఎండ వేడిని, ఉక్క పోతను తట్టుకోలేక ఏమైనా చల్ల చల్లగా కూల్‌గా తినాలి అనిపిస్తుంది. దీంతో అందరూ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, సోడాలు ఇలా ఏవో ఒకటి తాగుతూ ఉంటారు. ముఖ్యంగా అలసట, నీరసాని దూరంగా ఉండాలని సోడాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు.

సోడాల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట. సోడాలు ఎక్కువ తాగితే దంతాలు త్వరగా పాడైపోతాయట. పళ్లు పుచ్చి పోవడం, రంగు మారడం, సున్నితత్వం పెరగడం వంటి సమస్యలు వస్తాయట.

సోడాల్లో కేలరీలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. సోడాలు తాగితే బీపీ, డయాబెటీస్ సమస్యలు కూడా రావచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి.

సోడా తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీంతో కిడ్నీలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. అదే విధంగా సోడాలను అదే పనిగా తాగుతూ ఉంటే.. ఎముకలు బలహీన పడి, ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది.

పురుషులు సోడాలను తాగితే.. వీరిలో సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. కడుపు ఉబ్బరం, అజీర్తి, తలనొప్పి, మల బద్ధకం వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా సోడాలను తీసుకోకండి.