
ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కాబట్టి అందరూ ఆరోగ్యంపై దృష్టిసారించాలి. ప్రస్తుతం ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్ టీ తాగుతున్నారు. దీని రుచి కొంతమందికి నచ్చకపోయినా ప్రయోజనాల కోసం తాగడం మొదలుపెడుతున్నారు. కాగా ఈ టీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను మేరుపరుస్తుంది.

గ్రీన్ టీలో ముఖ్యంగా కాటెచిన్లు అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు కణాల నష్టం నుంచి రక్షించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడానికి సహాయపడతాయి.

green tea

దీని కారణంగా ఆరోగ్యకార పోషకాలను గ్రహించడం కష్టతరం మారుతుంది. పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉన్న గ్రీన్ టీ జీర్ణక్రియకు ఉపయోగపడినప్పటికి భోజనం చేసిన వెంటనే దీన్ని తీసుకోకూడదు. దీనిలోని కెఫిన్, టానిన్లు జీర్ణక్రియకు హాని కలిగించి అజీర్తికి కారణం అవుతాయి.

కొంతమందికి ఉదయాన్నే ఏమి తినకుండా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం అలవాటు. అయితే ఈ పద్దతి శరీరానికి హాని కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంద వికారం పుడుతుంది. దీనిలో ఉన్న టానిన్లు కారణంగా కడుపులో యాసిడ్ పెరిగి కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు వస్తాయి.