Beauty Tips: మీ అందాన్ని పెంచే అద్భుతమైన డ్రింక్.. రోజూ ఖాళీకడుపుతో తాగండి.. మెరిసే చర్మాన్ని పొందండి
ప్రతి ఒక్కరూ తాము అందంగా కనిపించాలని అనుకుంటారు. అందుకోసం ఎందరో డాక్టర్లను సంప్రదిస్తారు. రకరకాల క్రీములను వాడుతారు. కొన్ని సార్లు అవి బెడిసికొట్టి ఉన్న ముఖాన్ని పాడుచేసుకుంటారు. కానీ మన ఇంటి పరిసరాల్లో దొరికే సహజవనరు అయిన తులసి ఆకులను ఉపయోగించుకొని మన ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి తులసి ఆకులతో మనం అందమైన ముఖం, ఆరోగ్యాన్ని ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Oct 03, 2025 | 8:06 PM

తులసిని ప్రకృతి సౌందర్యాన్ని పెంచేదిగా భావిస్తారు. తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు శరీరం నుండి విషాన్ని తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తం శుద్ధి అయినప్పుడు, ముఖం స్వయంచాలకంగా ప్రకాశిస్తుంది. అందువల్ల రోజూ ఖాళీ కడపుతో తులసి నీరు తాగితే మీరు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రకాశవంతమైన ముఖాన్ని పొందుతారు.

రోజూ ఖాళీ కడుపుతో తులసి నీరు తాగడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు త్వరగా మాయమవుతాయి.

తులసి నీటిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను మరమ్మతు చేసి కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. ఈ ప్రక్రియ ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది. దీని వల్ల చర్మం ఎల్లప్పుడు ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తుంది.

ఉదయం తులసి నీరు తాగడం వల్ల శరీరంలో నీటి సమతుల్యత కాపాడుతుంది, ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. అలాగే ఇది వృద్యాప్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. తులసిలోని విటమిన్ సి, ఇతర పోషకాలు ముడతలు, చక్కటి గీతలను తగ్గించడంలో సహాయపడతాయి, చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి.

తులసి టీ రక్తప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తులసి టీ తాగడం వల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుంది. ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.




