AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Potato Peel : తొక్కలో ఏముందని తీసి పడేస్తున్నారా?.. ప్రయోజనాలు తెలిస్తే.. చిన్న పీస్‌కూడా వేస్ట్ చేయరు!

Benefits of potato peels: చర్మ ఆరోగ్యానికి కేవలం మార్కెట్‌లో దొరికే బ్యూటీ ప్రాడక్ట్స్ మాత్రమే సహాపడుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ మన వంటిట్లో ఉండే కొన్ని పదార్థాలు కూడా సహాజంగా మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో ఒకటే ఆలుగడ్డ. చాలా మంది దీన్ని వండేప్పుడు దాని తొక్క తీసి పడేస్తారు. కానీ ఈ తొక్కలోనే మనకు కావాల్సిన చాలా పోషకాలు ఉంటాయి.బంగాళాదుంప తొక్కల్లో విటమిన్ సి, పొటాషియం, ఐరన్, సహజ బ్లీచింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మ ఆరోగ్యానికి ఏవిదంగా సహాయపడుతాయో చూద్దాం.

Anand T
|

Updated on: Jun 15, 2026 | 2:52 PM

Share
ముఖంపై నల్లని మచ్చలు, మొటిమలు ఉన్న వారికి ఆలుగడ్డ తొక్కలలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో సహజంగానే బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇవి ఎండ వల్ల నల్లగా మారిన ముఖాన్ని, ముఖంపై ఉన్న మొటిమలను తొలగించడంలో సహాయపడుతాయి. ఇందుకోసం మీరు మొదట ఆలుగడ్డ తొక్కలను శుభ్రం చేసి.. వాటిని ముఖంపై మెల్లగా రుద్దండి. ఆ తర్వాత వాటిని ముఖంపైనే 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై సాధారణ నీటితో కడిగేసుకోండి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చర్మం మచ్చలు లేకుండా గ్లోయింగ్‌గా మారుతుంది.

1 / 5
చాలా మందికి లేట్‌ నైట్స్ నిద్రపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, వాపులు ఏర్పడుతాయి. వీటిని తొలగించడానికి ఆలుగడ్డ తొక్కలు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు ముందు తాజా ఆలూ తొక్కలను తీసుకొని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరచండి. ఆ తర్వాత ఆ చల్లటి తొక్కలను కళ్లపై పెట్టుకుని 15 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వండి. ఇది కళ్ల చుట్టూ ఉన్న ప్రాంతానికి చలవను అందించి, నల్లటి వలయాలను పూర్తిగా తొలగించడంలో సహాయపడుతుంది.

2 / 5
ఆలూ తొక్కలను మొక్కలకు ఎరువులా కూడా వాడొచ్చు. ఇందుకోసం తొక్కలని అన్నింటిని సేకరించి మీ ఇంట్లోని మొక్కల కుండీలలో వేయండి. బంగాళాదుంప తొక్కల్లో పొటాషియం, నైట్రోజన్, ఫాస్పరస్, ఐరన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలా కాకుంటే ఈ తొక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని మొక్కలకు పోయండి. లేదా తొక్కలను ఎండబెట్టి మట్టిలో కలపండి. దీనివల్ల మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి.

3 / 5
జిడ్డు చర్మం ఉన్నవారికి దుమ్ము, ధూళి కారణంగా ముఖంపై త్వరగా మొటిమలు వస్తుంటాయి. అలాంటి వారికి ఆలూ తొక్కలు చాలా భాగా పనిచేస్తాయి. వీటిని ఎలా వాడాలి అంటే.. ఈ తొక్కలను గ్రైండ్ చేసి రసం తీయండి. ఆ రసంలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోండి. ఇది చర్మంపై ఉన్న అదనపు జిడ్డును పీల్చేసి, చర్మ రంధ్రాలను లోపలి నుండి శుభ్రం చేస్తుంది.

4 / 5
ఆలూ తొక్కలు చర్మానికే కాదు, జుట్టుకు ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక పాత్రలో రెండు కప్పుల నీరు తీసుకుని, అందులో ఒక కప్పు ఆలూ తొక్కలు వేసి 10 నుండి 15 నిమిషాల పాటు బాగా మరిగించండి. నీరు సగానికి తగ్గిన తర్వాత, దానిని వడకట్టి చల్లార్చండి. మీరు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత, ఈ నీటిని మీ జుట్టుకు, కుదుళ్లకు పట్టించండి. తెల్లబడుతున్న జుట్టును సహజ పద్ధతిలో మెల్లగా నల్లగా మార్చడానికి ఇది ఒక అద్భుతమైన ఇంటి చిట్కా.

5 / 5
Follow Us