Sugar Control Tips : ఈ వ్యాయామాలు చేస్తే షుగర్ అదుపులో ఉండటం పక్కా…ఓసారి ట్రై చేసి చూడండి.

| Edited By: Narender Vaitla

May 14, 2023 | 1:40 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ బాధితులు కొన్ని వ్యాయామాలు చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. వారానికి 150 నిమిషాలు కచ్చితంగా వ్యాయామం చేయాలి.

1 / 8
ప్రస్తుత కాలంలో చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ బాధితులు కొన్ని వ్యాయామాలు చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. వారానికి 150 నిమిషాలు కచ్చితంగా వ్యాయామం చేయాలి. అంటే రోజుకు 21 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని నిపుణులు అంటున్నారు.

2 / 8
స్విమ్మింగ్:
ఈత శరీరానికి ఉత్తమమైన వ్యాయామం. ఇది మిమ్మల్ని ఫిట్‌గా మార్చుతుంది. అంతేకాదు మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం స్విమ్మింగ్ టైప్-1, టైప్-2 మధుమేహం రెండింటిలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. స్విమ్మింగ్ రక్త ప్రసరణను వేగవంతం చేయడంతోపాటు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది.  బరువు, రక్తంలో చక్కెర స్థాయిలలో ఎలాంటి హెచ్చుతగ్గులు అనేవి ఉండవు.

స్విమ్మింగ్: ఈత శరీరానికి ఉత్తమమైన వ్యాయామం. ఇది మిమ్మల్ని ఫిట్‌గా మార్చుతుంది. అంతేకాదు మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం స్విమ్మింగ్ టైప్-1, టైప్-2 మధుమేహం రెండింటిలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. స్విమ్మింగ్ రక్త ప్రసరణను వేగవంతం చేయడంతోపాటు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది. బరువు, రక్తంలో చక్కెర స్థాయిలలో ఎలాంటి హెచ్చుతగ్గులు అనేవి ఉండవు.

3 / 8
సైక్లింగ్:
సైక్లింగ్ అనేది ఒక రకమైన ఏరోబిక్స్ వ్యాయామం లాంటిది. ఇది గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే అధిక బరువు, రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, డయాబెటిస్ తో  బాధపడుతున్న వ్యక్తులు సైక్లింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. సైక్లింగ్ అనేది తేలికపాటి ఎక్సర్ సైజ్ గా చెబుతుంటారు ఆరోగ్య  నిపుణులు.

సైక్లింగ్: సైక్లింగ్ అనేది ఒక రకమైన ఏరోబిక్స్ వ్యాయామం లాంటిది. ఇది గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే అధిక బరువు, రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, డయాబెటిస్ తో బాధపడుతున్న వ్యక్తులు సైక్లింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. సైక్లింగ్ అనేది తేలికపాటి ఎక్సర్ సైజ్ గా చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

4 / 8
వాకింగ్:
వాకింగ్  ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాల్సిన వ్యాయామం. రోజువారీ నడక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మధుమేహం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో జాగింగ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.  మధుమేహ వ్యాధిగ్రస్తులకు వాకింగ్ దివ్యౌషధం లాంటిది. వాకింగ్ అనేది  ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌లో అంటే రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

వాకింగ్: వాకింగ్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాల్సిన వ్యాయామం. రోజువారీ నడక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మధుమేహం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో జాగింగ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు వాకింగ్ దివ్యౌషధం లాంటిది. వాకింగ్ అనేది ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌లో అంటే రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

5 / 8
మెట్లు ఎక్కడం:
 నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో  మెట్లు ఎక్కడం చాలా అరుదు. ప్రతి బిల్డింగ్ లోనూ లిఫ్ట్ ను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు మెట్లు ఎక్కడం మంచిది. ఓ అధ్యయనం ప్రకారం మెట్లు ఎక్కితే రక్తంలో గ్లూకోజ్ కంట్రోల్లో ఉంటుందని తేలింది.

మెట్లు ఎక్కడం: నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో మెట్లు ఎక్కడం చాలా అరుదు. ప్రతి బిల్డింగ్ లోనూ లిఫ్ట్ ను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు మెట్లు ఎక్కడం మంచిది. ఓ అధ్యయనం ప్రకారం మెట్లు ఎక్కితే రక్తంలో గ్లూకోజ్ కంట్రోల్లో ఉంటుందని తేలింది.

6 / 8
యోగా:
యోగా అనేది ఓ సాదనంగా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో యోగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.  ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతోపాటు ఎముకలను బలపరుస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ అరగంట పాటు యోగా చేయడం చేస్తే డయాబెటిస్ సమస్య చాలా వరకు తగ్గుతుంది.

యోగా: యోగా అనేది ఓ సాదనంగా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో యోగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతోపాటు ఎముకలను బలపరుస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ అరగంట పాటు యోగా చేయడం చేస్తే డయాబెటిస్ సమస్య చాలా వరకు తగ్గుతుంది.

7 / 8
హార్వర్డ్‌లోని నిపుణులు ఆహారం తీసుకున్న 1-3 గంటల తర్వాత వ్యాయామం చేయాలని సిఫార్సు చేస్తున్నారు, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.మీరు ఇన్సులిన్ ఉపయోగిస్తే, వ్యాయామం చేసే ముందు మీ రక్తంలో చక్కెరను పరీక్షించడం చాలా ముఖ్యం. వ్యాయామానికి ముందు స్థాయి 100 mg/dL కంటే తక్కువగా ఉంటే, ఒక పండు  తినడం లేదా అల్పాహారం తీసుకోవడం వల్ల అది పెరుగుతుంది.  మీరు హైపోగ్లైసీమియాను నివారించడంలో సహాయపడుతుంది. మళ్లీ పరీక్షించడం 30 నిమిషాల తర్వాత మీ బ్లడ్ షుగర్ స్థాయి స్థిరంగా ఉందో లేదో చూపిస్తుంది. ప్రత్యేకంగా ఏదైనా కఠినమైన వ్యాయామం లేదా కార్యాచరణ తర్వాత మీ బ్లడ్ షుగర్‌ని చెక్ చేసుకోవడం కూడా మంచిది," అని హెచ్చరించింది.

8 / 8
వ్యాయామం చేసిన తర్వాత హైపోగ్లైసీమియా లేదా తక్కువ బ్లడ్ షుగర్ వచ్చే ప్రమాదం అత్యధికంగా 6-12 ఉంటుందని పేర్కొంది. మీ బ్లడ్ షుగర్ 250 కంటే ఎక్కువగా ఉంటే, వ్యాయామం చేయకుండా ఉండండి, అది మరింత పెరగవచ్చు.

వ్యాయామం చేసిన తర్వాత హైపోగ్లైసీమియా లేదా తక్కువ బ్లడ్ షుగర్ వచ్చే ప్రమాదం అత్యధికంగా 6-12 ఉంటుందని పేర్కొంది. మీ బ్లడ్ షుగర్ 250 కంటే ఎక్కువగా ఉంటే, వ్యాయామం చేయకుండా ఉండండి, అది మరింత పెరగవచ్చు.