- Telugu News Photo Gallery Does this make my scalp dandruff? Those tips are enough, the whole thing is gone.
తలపై చుండ్రు ఇబ్బంది పెడుతుందా.? ఆ టిప్స్ చాలు.. మొత్తం మాయం..
ఈ రోజుల్లో చాలామంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చుండ్రు కారణంగా తలపై దురద, చికాకు కలుగుతుంది. ఎన్ని రకాల సంపూలు వాడిన చుండ్రు సమస్య అస్సలు తగ్గదు. అయితే కొన్ని సహజ చిట్కాలతోనే ఈ సమస్యలు దూరం చేయవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటి.? ఎలా ఉపయోగపడతాయి.? ఈరోజు మనం తెలుసుకుందాం..
Updated on: Nov 26, 2025 | 7:00 AM

కలబంద మొక్కలో ఉండే ఔషధ గుణాలు సౌందర్య సాధనాల్లోనే కాకుండా వంటగదిలో అనుకోకుండా చిన్న గాయాలకు మంచి మెడిసిన్‌గా కూడా పనిచేస్తుంది. వంటింట్లో అనుకోకుండా చిన్న చిన్న గాయాలు అయినప్పుడు అలోవెరా జెల్ రాసుకోవటం వల్ల తక్షణ ఉపశమనంఇస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్: ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమాన మోతాదులో కలిపి షాంపూ చేసిన తర్వాత అప్లై చేయండి. తలపై చర్మపు pH సమతుల్యం చేయడానికి, చుండ్రును తగ్గించడానికి 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత క్లీన్ చేసుకోండి.

కొబ్బరి నూనె నిమ్మరసం: కొబ్బరి నూనెను నిమ్మరసంతో కలిపి మీ తలకు మసాజ్ చేయండి. తలస్నానం చేయడానికి ముందు 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా వారానికి రెండుసార్లు కొన్ని రోజుల పాటు చేస్తే చాలు చుండ్రు సమస్య దూరం అవుతుంది.

మెంతుల పేస్ట్: మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్ని పేస్ట్‌లా తయారు చేసుకుని, తలకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే దురద, పొట్టు తగ్గుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

టీ ట్రీ ఆయిల్: మీ షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ జోడించండి. దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును సహజంగా చికిత్స చేయడానికి, అలాగే తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి.




