Water for Weight Loss: తెలుసా.. నీళ్ల ద్వారా కూడా బరువు తగ్గొచ్చట? ఎలాపడితే అలాతాగితే అసలుకేఎసరు

Updated on: Dec 02, 2024 | 1:32 PM

చాలా మంది బరువు తగ్గడానికి నానాపాట్లు పడుతుంటారు. అయితే సింపుల్ గా నీళ్లు తాగితే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. రోజూ ఈ వేళల్లో నీళ్లు తాగితే ఎలాంటి శారీరక కసరత్తులు చేయకుండానే సులువుగా బరువుతగ్గొచ్చంటున్నారు నిపుణులు..

1 / 5
శరీరానికి నీరు అత్యంత అవసరం. అన్ని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రోజూ తగినంత నీళ్లు తాగాలని వైద్య ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతుంటారు. కానీ, చాలామంది ఈ విషయాన్ని సరిగా పట్టించుకోరు. నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగితే శరీరాన్ని త్వరగా రీహైడ్రేట్ చేయవచ్చు, రోజంతా చురుకుగా ఉండవచ్చు. ఇంకా దీనివల్ల మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.

2 / 5
హార్వర్డ్ నివేదిక ప్రకారం.. నీరు తాగడం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. భోజనానికి ముందు నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. దీని ప్రభావం కూడా చాలా త్వరగానే కనిపిస్తుంది. కానీ బరువు తగ్గాలంటే నీరు త్రాగే సమయాన్ని సరిగ్గా బ్యాలెన్స్‌ చేయాలి. భోజనం తినడానికి కనీసం అరగంట ముందు మాత్రమే నీరు త్రాగాలి. అలాగే రోజంతా చిన్న మొత్తంలో నీరు త్రాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు అందుతాయి.

3 / 5
drinking water

drinking water

4 / 5
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగితే, అది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొన్ని రోజుల్లోనే తేడా కనిపిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల మెదడుపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

5 / 5
బరువు తగ్గడానికి, శరీర కొవ్వును కరిగించడం అవసరం. శరీరానికి తగినంత నీటిని అందించడం ద్వారా, కొవ్వును వేగంగా కరిగించవచ్చు. నిజానికి ఒంట్లోకి నీరు వెళ్లిన తర్వాత శరీరంలోని కణాల్లోని కొవ్వును కరిగించి శక్తిగా మార్చడం వల్ల బరువు తగ్గడానికి వీలుంటుంది.