
ప్రతి ఆదివారం ఏదొక నాన్ వెజ్ ఐటెం ను తెచ్చుకుని తింటారు. చికెన్, మటన్ ఇలా ఎవరి స్థోమతకి తగ్గట్టు వారు తెచ్చుకుని తింటారు. ఇక కొందరు ప్రతి వారం చేపలు కూర వండుకుని లాగిస్తూనే ఉంటారు.

ఒక వారం, రెండు వారాలు అయితే ఏం కాదు. కానీ, ప్రతి వారం చేపలను తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, వీటిని తినడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

చేపలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలుసు. అయితే, వీటిని మితి మిరి తింటే నరాల వ్యవస్థ దెబ్బతీస్తుంది. ఎందుకంటే వీటి వలన మతిమరుపు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు,చేతులు కూడా వణుకుతాయని అంటున్నారు. ముఖ్యంగా, గర్భిణీలు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఇది కడుపులో ఉండే శిశువు అభివృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.

చేపలు అందరికీ పడవు. ఇది తింటే చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, అలాంటి వాళ్ళు తిని బాధ పడే కన్నా తినకుండా ఉండటమే మంచిది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)