
అనంత్ అంబానీ, ముకేశ్ అంబానీ- నీతు అంబానీల చిన్న కుమారుడు. ఇషా, ఆకాష్ అంబానీల తర్వాత అనంత్ అంబానీ జన్మించాడు. ఇక అనంత్ అంబానీ స్కూలింగ్ విషయానికొస్తే ధీరుబాబు అంబానీ ఇంటర్నేషన్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభాసాన్ని పూర్తి చేశారు.

ఇక 12వ తేదీ తర్వాత పూర్తయిన తర్వాత అనంత్ అంబానీ పై చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఆయన అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.

అనంత్ అంబానీ మంచి జంతు ప్రేమికుడు. జంతువుల సంరక్షణ కోసం అనంత్ ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఇక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అనంత్.. రియలన్స్ ఇండస్ట్రీస్‌కు ఎనర్జీ బిజినెస్ హెడ్‌గా సేవలందిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ ఓవర్‌సీస్ గ్లోబల్ ఆపరేషన్స్‌ను అనంత్ చూసుకుంటున్నారు.

ఇక దీంతో పాటు జియోకి చెందిన పలు ప్లాట్‌ఫామ్స్‌తో పాటు, రియలన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో బోర్డ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

అలాగే జియో ఇన్‌స్టిట్యూట్ గవర్నింగ్ కౌన్సిలింగ్‌లో మెంబర్‌గా అనంత్ అంబానీ పనిచేస్తున్నారు. దీంతో పాటు యానిమల్ వెల్ఫేర్, ఎన్విరాన్‌మెంటల్ సస్టనబిలిటీతో పాటు మరెన్నో ఛారిటీల్లో అనంత్ అంబానీ పాలుపంచుకున్నారు.