Health Tips: చీప్‌గా చూడొద్దు.. ఆ వ్యాధులకు ఈ జ్యూస్ దివ్య ఔషదం.. రోజూ తాగారంటే..
Papaya leaf juice: బొప్పాయి పండు ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందదిస్తుందని అందరికీ తెలుసు. అయితే, బొప్పాయి పండుతో పాటు వాటి ఆకుల రసం కూడా అంతే మేలు చేస్తుందని చాలామందికి తెలియదు. బొప్పాయి ఆకుల్లో పోషకాలు, ఎంజైములు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఈ రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Oct 14, 2025 | 12:53 PM

బొప్పాయి ఆకుల రసం డెంగ్యూ జ్వరానికి అత్యంత ప్రభావితంగా పనిచేస్తుంది. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మన రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను తగ్గితుంది. అలాంటప్పుడు మనం బొప్పాయి ఆకులను రసంగా చేసుకొని తాగితే మనలో ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది. ఎందుకంటే బొప్పాయి ఆకుల రసంలో పపైన్, కైమోపాపైన్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడతాయి. దీనితో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెరుగుతుంది. దీంతో రోగులు త్వరగా కోలుకుంటారు.

జీర్ణక్రియ ఆరోగ్యం: జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంచడంతో బొప్పాయి ఆకుల రసం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. అలాగే గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇది ప్రేగులను శుభ్రపరచడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడంలో సహాయపడుతుంది.

కాలేయ ఆరోగ్యానికి మంచిది: బొప్పాయి ఆకుల రసం కాలేయాన్ని శుద్ధి చేయడం ద్వారా ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు సహాయపడుతుంది. సిర్రోసిస్, కామెర్లు వంటి కాలేయ వ్యాధులను నివారించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాకుండా బొప్పాయి ఆకుల రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక వరంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే భాగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అలాగే ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇది మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారణ: ఈ రసంలోని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఇది శరీరంలోని విషపూరిత అంశాలను తొలగించి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.ఈ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించక పోయినా కనీసం నివారణ చర్యగా ఇది ఉపయోగపడుతుంది.

చర్మం, జుట్టు ఆరోగ్యం: బొప్పాయి ఆకుల రసం ముడతలు, మొటిమలు, మచ్చలను తగ్గించడం ద్వారా చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో ఉండే పోషకాలు మన జుట్టును బలోపేతం చేస్తాయి అలాగే జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)




