
రక్షాబంధన్ వచ్చేసింది. ఆగస్టు9 శనివారం రోజున ప్రతి ఒక్కరూ రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.ఈరోజన సోదరీమణులు సోదరుడికి రాఖీ కట్టి, తమ సోదరులను దీవిస్తారు. అయితే ఇలా తమ సోదరి ప్రేమతో కట్టిన రాఖీని ఎప్పుడు తీసెయ్యాలో చాలా మందికి తెలియదు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

రక్షాబంధన్ పండగ అనేది సోదరీ, సోదరీ మణుల బంధానికి, ప్రేమకు ప్రతీక. ప్రతి సోదరి తమ సోదరుడి శ్రేయస్సును కోరుకొని, వారు ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ, రాఖీని కడతారు. అంతే కాకుండా తమ బ్రదర్స్ కూడా తమకు రక్షగా ఉండాలని వారు కోరుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరూ రాఖీ పడగను సెలబ్రేట్ చేసుకుంటారు.

అయితే రాఖీని ప్రతి ఒక్కరూ చాలా భక్తితో, ప్రేమగా కట్టించుకుంటారు. కానీ కొంత మంది కట్టిన తర్వాత రాఖీలు ఎక్కువైనా లేదా, నార్మల్‌గా త్వరగానే తీసి పక్కన పెడుతుంటారు. అయితే అసలు చెల్లి లేదా అక్క ప్రేమతో మణికట్టు పైన కట్టిన రాఖీని ఎన్ని రోజులకు తీసివేయాలి అనేదాని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం

రాఖీ విషయంలో సోదరులు తప్పక కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు పండితులు. అది ఏమిటంటే? రాఖీని శ్రావణ అమావాస్య వరకు అంటే 15 రోజుల వరకు ఉంచుకోవడం మంచిదంట. కానీ కొందరు దానిని ఆరోజే లేదా రెండు ,మూడు రోజుల్లో తీసి వేస్తుంటారు. అంతే కాకుండా ఇంకొంత మంది జన్మాష్టమి, గణేష్ చతుర్థి రోజున రాఖీ తీసి వేస్తారు. ఇంకొందరు 24 గంటలు గడవకముందే తీసి వేస్తారు. కానీ రాఖీని తప్పక 24 గంటలు ఉంచుకోవాలంట.

కానీ దీనిని పితృపక్షం ప్రారంభానికి ముందు తీసి వేయాలంట. ఇది చాలా ప్రవితమైనది కాబట్టి దీనిని తీసినప్పుడు నీటిలో పడివేయడం మంచిదంట. అయితే కొందరు దీనిని ఎక్కువ రోజులు ఉంచుకుంటారు. కానీ ఇది దారం లాంటిది కాబట్టి,ధూళి వలన బ్యాక్టీరియా ఫామ్ అవుద్దీ అందుకే శుభ్రంగా ఉన్నన్ని రోజులు ఉంచుకోవడం మంచిదంట.