భారత దేశంలోని ఈ రహస్య ప్రదేశాలు తెలుసా..అక్కడికి వెళ్తే స్వర్గమే..
కొంత మంది సమ్మర్ లో టూర్ ప్లాన్ చేస్తే మరికొంత మంది రోహిణి కార్తె ముగింపు సమయంలో ఒకటి లేదా రెండు వర్షాలు పడ్డాక టూర్‌కు వెళ్దాం అనుకుంటారు. ఇప్పుడు అలాంటి వారికోసమే అద్భుతమైన సమాచారం. ప్రస్తుతం ఎండలు కాస్త తగ్గాయి. దీంతో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా?అయితే భారత దేశంలో ఎవ్వరికీ తెలియని కొన్ని ప్రదేశాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: May 26, 2025 | 5:45 PM

మన భారత దేశంలోని కొన్ని రహస్యమైన అందమైన అద్భుత ప్రదేశాలు ఉన్నాయంట. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఈ అందమైన ప్రదేశాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయంట.అవి ఏవో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చిట్కుల్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇది టూర్‌కు బెస్ట్ ప్లేస్. భారతదేశపు చివరి గ్రామంగా పిలిచే చిట్కుల్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. చెక్క ఇల్లు, ప్రశాంతమైన నదీ తీరం పర్యాటకులకు ఆనందాన్ని ఇస్తుంది.

చాలా మంది పచ్చని పొలాల్లో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అలాంటి వారికి షాంగర్ బెస్ట్ ప్లేస్. ఇక్కడికి వెళ్లాలి అంటే ఢిల్లీ నుంచి త్వరగా వెళ్ల వచ్చు. ఇక్కడి ప్రతి ప్లేస్ అద్భుతంగా ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చని పర్వతాలు, సాంప్రదాయమైన ఇళ్లులు అందరినీ ఆకట్టుకుంటాయి.

ట్రెక్కింగ్ ఆనందించాలి అనుకునే వారికి హిమాచల్ ప్రదేశ్‌లోని ధరంగ్ కోట్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. ఇది అందమైన పర్వతాలు, కేప్‌లతో పర్యాటకులను తెగ ఆకట్టుకుంటుంది. ఇక్కడి పచ్చని చెట్లు చూడటానికి చాలా అందంగా ఉంటాయి.

ట్రెక్కింగ్ ఆనందించాలి అనుకునే వారికి హిమాచల్ ప్రదేశ్‌లోని ధరంగ్ కోట్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. ఇది అందమైన పర్వతాలు, కేప్‌లతో పర్యాటకులను తెగ ఆకట్టుకుంటుంది. ఇక్కడి పచ్చని చెట్లు చూడటానికి చాలా అందంగా ఉంటాయి.



