శీతాకాలం వచ్చిందంటే వాతావరణం చల్లగా ఉంటుంది. వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఈ సీజన్ లో చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఏ పనీ త్వరగా చేయాలనిపించదు. దుప్పటి కప్పుకుని పడుకుంటే 10 లేదా 11 గంటలు అయినా మెలకువరాదు. అలానే పడుకోవాలని అనిపిస్తుంది. సూర్య కాంతి ఎక్కువగా రాదు. దీని వల్ల శరీరానికి కావాల్సినంత విటమిన్ డి అందదు. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
మరి ఈ బద్ధకాన్ని పక్కకు పెట్టి యాక్టీవ్ గా ఉండటానికి, బద్ధకాన్ని దూరం చేసుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు సహాయ పడతాయి. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే బద్ధకాన్ని వదిలించుకోవచ్చు. అలసటను తగ్గించి.. సరైన విధంగా సెల్ పనితీరుకు తోడ్పడతాయి.
బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అనేవి సమృద్ధిగా ఉంటాయి. చలి కాలంలో వీటిని తీసుకోవడం వల్ల అభిజ్ఞా పనితీరు మెరుగు పడుతుంది. అంతే కాకుండా వీటిని తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడి, ఎనర్జీ లెవల్స్ ని పెంచుతుంది. దీంతో యాక్టీవ్ గా ఉంటారు.
చిలగడ దుంపలు, బాదంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో ఉండే పోషకాలు, యాటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు.. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు దరి చేరవు. అంతే కాకుండా శరీర కణాల సామర్థ్యాన్ని పెంచుతాయి. దీంతో శరీరం యాక్టీవ్ అయ్యేందుకు సహాయ పడతాయి.
క్వినోవాలో కూడా పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, జీవ క్రియల పని తీరును మెరుగు పరుస్తాయి. దీంతో బాడీలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అలాగే చియా సీడ్స్ ని డైట్ లో చేర్చు కోవడం వల్ల బద్ధకం అనేది దూరం అవుతుంది. అంతే కాకుండా చియా సీడ్స్ తీసుకుంట తక్షణమే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.