
ఆకలి వేయడం అనేది సహజమైన ప్రక్రియ. ఆకలి వేసినప్పుడు ఏది అవైలబుల్‌గా ఉండే ఆ ఆహారం తీసుకుంటారు. దీంతో కడుపు నిండుతుంది. అయితే తిన్న తర్వాత కూడా మళ్లీ వెంటనే ఆకలి వేస్తే.. జాగ్రత్త పడండి. ఇలా అందరికీ జరగదు. కేవలం షుగర్ వ్యాధి ఉన్నవారికి మాత్రమే ఇలా ఆకలి వేస్తుంది.

తిన్న తర్వాత ఆకలి వేస్తుంది అంటే.. నిపుణుల ప్రకారం దాన్ని 'హైపర్ ఫాగియా' అని పిలుస్తారు. ఈ పరిస్థితి ఉన్నవారు ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. తిన్న తర్వాత కూడా మళ్లీ ఆకలి వేస్తుంది. ఇది షుగర్ వ్యాధి రావడానికి ముందస్తు హెచ్చరిక.

ఇన్సులిన్ చక్కెరను శక్తిగా మార్చడంలో సమస్యల వల్ల ఈ హైపర్ ఫాగియా అనేది ఏర్పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. టైప్ 1 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్‌తో సహా అన్ని రకాల షుగర్ వ్యాధుల్లో ఇది సాధారణమని నిపుణులు చెబుతున్నారు.

కేవలం మధుమేహం కారణంగానే కాకుండా డిప్రెషన్ వల్ల కూడా ఆకలి అవుతుందట. ఎందుకంటే.. ఒత్తిడికి గురైనప్పుడు శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

అదే విధంగా ఆందోళనగా ఉన్నవారిలో కూడా ఆకలి వేస్తుందని నిపుణులు అంటున్నారు. మీకు అతిగా ఆకలి వేస్తుందటే.. వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు. వారి సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి.