- Telugu News Photo Gallery Technology photos Poco launches new smart phone poco x5 5g features and price details
Poco X5 5G: తక్కువ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్ అంతే..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. పోకో ఎక్స్5 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 08, 2024 | 8:07 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. పోకో ఎక్స్ 5జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను సూపర్ నోవా గ్రీన్, వైల్డ్‌క్యాట్ బ్లూ, జాగ్వార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు.

ఇప్పటికే లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 2000 డిస్కౌంట్ లభిస్తుంది.

పోకో ఎక్స్ 5 స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగ్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ గరిష్టంగా 1200నిట్స్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 22 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.




