చెడు కలలు వస్తే నిజంగానే చెడు జరుగుతుందా?

Updated on: Aug 15, 2025 | 2:53 PM

కలలు కనడం సహజం. ప్రతి ఒక్కరూ నిత్యం కలలు కంటారు. కొందరు పగటి పూట కలలు కంటే మరి కొంత మంది రాత్రి సమయంలో, ఇంకొందరు తెల్లవారు జామున కలలు కంటారు. ఇక కలల్లో కొన్ని మంచి కలలు, మరికొన్ని చెడు కలలు ఉంటాయి. అయితే కొంత మంది చెడు కలలు వస్తే తెగ భయపడిపోతుంటారు. మరి నిజంగానే చెడు కలలు వస్తే చెడు జరుగుతుందా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడే ఇదే విషయం గురించి తెలుసుకుందాం పదండి!

1 / 5
కలలు ప్రతి ఒక్కరూ కంటారు. కలలో కొంత మందికి తమ పూర్వీకులు, చెట్లు, వాహనాలు, చిన్నపిల్లలు , తమ ఇష్టదైవాలు కనిపిస్తే, మరికొంత మందికి మాత్రం రాక్షసులు, ఆత్మలు, ఏవేవో వింత జంతువులు, తమకు తెలిసిన వారు మరణించినట్లు కలలు వస్తుంటాయి.  అయితే చెడు కలలు వస్తే చాలా మంది వణికిపోతుంటారు. ఆ రోజు మొత్తం ఏదో భయంతో గడిపేస్తుంటారు.

2 / 5
అయితే చెడు కలలు వస్తే నిజంగా చెడు జరుగుతుందా? అంటే అందులో వాస్తవం లేదు అంటున్నా పండితులు. చెడు కలలు కొన్ని సార్లు మనలో మంచికి నిదర్శణం అవుతే కొన్ని సార్లు మాత్రం సమస్యలను సూచిస్తాయంట. అయితే అసలు చెడు కలలకు ఉన్న అర్థాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

3 / 5
కొంత మందికి తమకు తామే సూసైడ్ లేదా ఏదో విధంగా చనిపోయినట్లు కలలు వస్తుంటాయి. అయితే అటువంటి కలలు మీలోని పాటిజిటివ్ థింకింగ్‌కు కారణం అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా చనిపోయిన బంధువులు కలలో కనిపిస్తే అది వారిని మీరు మర్చిపోలేకపోతున్నారని, వారిపై మీకు ఉన్న ప్రేమకు సంకేతం అంట.

4 / 5
మీరు ఏదో పెద్ద భవనం లేదా కారు , బస్సు లాంటి ఏదైనా ప్రమాదం జరిగినట్టు కల వస్తే, అది మీరు మీలో ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నట్లని చెబుతున్నా నిపుణులు. అలాగే మీరు నగ్నంగా ఉన్నట్టు కలలో వస్తే, మీ ఆత్మగౌరవం తగ్గడం, మీలో ఉన్న భయానికి సూచన అని చెబుతున్నారు పండితులు.

5 / 5
ఇక కొంత మందికి పదే పదే పాములు కలలో కనిపిస్తుంటాయి. అయితే పాములు పదే పదే కనిపించడం నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయని అర్థం అంట. ( నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)