
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం చాపకింద నీరులా ప్రాణాలను హరిస్తోంది. ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలలో ఈ వ్యాధి నానాటికీ ప్రభలుతోంది. నేటి కాలంలో 8-80 సంవత్సరాల వయస్సు గల వారు అధికంగా మధుమేహంతో బాధపడుతున్నారు. కొంతమందికి కుటుంబ చరిత్ర కారణంగా కూడా ఈ వ్యాధి సోకుతుంది. చాలా మంది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు.

మధుమేహానికి ప్రధాన కారణం జీవనశైలి. ప్రస్తుతం చాలా మంది జీవన విధానం మారిపోయింది. కంటిన్యూగా కూర్చోవడం, ఏ విధమైన పని చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం ఇవన్నీ టైప్ 2 డయాబెటిస్ పెరగడానికి కారణాలు. దీంతో ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉంటున్నారు. రక్త పరీక్షలో చక్కెరను గుర్తించినట్లయితే వెంటనే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.. మామిడికాయల సీజన్ వస్తోంది. బరువు అదుపులో ఉండాలంటే, మామిడిపండు అస్సలు తినకూడదు. మామిడి పండ్లలో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. మామిడి పండ్లు, ద్రాక్ష పండ్లను అస్సలు తినకూడదు. అలాగే అరటిపండ్లు అస్సలు తినకూడదు. ఇందులో ఎక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అరటిపండ్లు ఎక్కువగా తింటే బరువు పెరగడంతోపాటు షుగర్ కూడా పెరిగే అవకాశం ఉంది.

రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా జాగింగ్ లేదా వాకింగ్‌కు వెళ్లాలి. వ్యాయామం కూడా చేయాలి. డిటాక్స్ వాటర్‌తో రోజును ప్రారంభించాలి. జీలకర్ర లేదా మెంతిగింజలు నానబెట్టిన నీటిని తాగాలి. ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తినాలి. నూనె, సుగంధ ద్రవ్యాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది.

కివీ, నారింజ.. రెండు పండ్లను రోజువారీ పండ్ల జాబితాలో ఉంచడం మర్చిపోకూడదు. కివిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ ఒక కివి తింటే చాలా మంచిది.

అల్పాహారం తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తే పండ్లు తినాలి. ఆ జాబితాలో యాపిల్ ఫస్ట్ చేర్చుకోవాలి. యాపిల్స్‌లో క్యాలరీలు అస్సలు ఉండవు. రక్తంలో చక్కెర నియంత్రణకు యాపిల్స్ బెస్ట్ ప్రూట్స్. జామ కూడా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది