ప్రస్తుతకాలంలో డయాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా లక్షలాది మంది దీని బారిన పడుతున్నారు. అయితే.. మధుమేహం సమస్య కేవలం చక్కెర లేదా కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాల వల్ల మాత్రమే కాదు.. శరీరంలో మెగ్నీషియం లోపం కూడా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఈ ఖనిజం ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాదు, శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ప్రభావితం చేస్తుంది. మీ శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే, మీరు కండరాల తిమ్మిరి, బలహీనత, అలసట, క్రమరహిత హృదయ స్పందన, ఒత్తిడి, నిద్రలేమి, వికారం, ఎముకలలో బలహీనత వంటి లక్షణాలను అనుభవించవచ్చు. మెగ్నీషియం లోపం డయాబెటిస్ తోపాటు చాలా ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది. అయితే.. మెగ్నీషియం లోపాన్ని ఆహారంతో చెక్ పెట్టవచ్చు.. ఇక్కడ పేర్కొన్న ఈ 5 ఆహారాలు మెగ్నిషియం లోపాన్ని నియంత్రించడంలో డయాబెటిస్ ప్రమాదం నుంచి రక్షించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.. అవేంటో చూడండి..