మందులక్కర్లేదు.. డైట్ అవసరమే లేదు.. డయాబెటిస్‌కు అద్భుతమైన ఛూమంత్రం..!

|

Oct 10, 2024 | 1:12 PM

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మధుమేహం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. ప్రమాదకరమైన డయాబెటిస్ వ్యాధికి సరైన మందంటూ ఏదీ లేదు.. కొన్ని అందుబాటులో ఉన్నా అవి షుగర్ నియంత్రణ కోసం మాత్రమే.. అందుకే.. షుగర్ ను కంట్రోల్ ఉంచుకునేలా జీవనశైలిని, తినే ఆహారంలో మార్పులు చేసుకోవడమే..

1 / 5
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మధుమేహం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. ప్రమాదకరమైన డయాబెటిస్ వ్యాధికి సరైన మందంటూ ఏం లేదు.. అందుకే.. షుగర్ ను కంట్రోల్ ఉంచుకునేలా జీవనశైలిని, తినే ఆహారాన్ని మార్చుకోవడమే.. ప్రస్తుత కాలంలో చాలా మంది రోగుల్లో టైప్ -2 డయాబెటిస్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీంతోనే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉంటాయి.. లేకపోతే పెరగడమో.. లేక తగ్గడమో జరిగి.. ప్రాణాంతకంగా మారుతుంది.. అయితే.. డయాబెటిస్ లో కీర దోసకాయ చాలా మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దోసకాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దోసకాయ శరీరంలోని నీటి కొరతను పూడ్చడమే కాకుండా బ్లడ్ షుగర్ రోగులకు కూడా చాలా మేలు చేస్తుందంటున్నారు. కీర దోసకాయ తినడం వల్ల రక్తంలో చక్కెర ఎలా అదుపులో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
దోసకాయలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతమైన అనేక పదార్థాలు ఉన్నాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో దోసకాయను చేర్చుకోవాలి. ఇంకా, బరువు పెరగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడకుండా ఉండే ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకు దోసకాయ తింటే స్థూలకాయం నివారిస్తుంది.

3 / 5
కీరదోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి శక్తినిస్తుంది. ఇది ఏదైనా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడేవారు కంటి సమస్యలను ఎదుర్కొంటారు. కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడే విటమిన్ ఎ సమృద్ధిగా ఉన్నందున దోసకాయ తీసుకోవడం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
దోసకాయలోని యాంటీఆక్సిడెంట్లు యూరిక్ యాసిడ్ నియంత్రణలో సహాయపడతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఆరోగ్యంగా ఉంటే, ఇన్సులిన్ స్థాయి బాగా ఉంటుంది.  డయాబెటిక్ రోగులకు తరచుగా మూత్ర సమస్యలు ఉంటాయి. ఇది శరీరంలో నీటి కొరతకు దారితీస్తుంది. దోసకాయలో నీరు సమృద్ధిగా ఉంటుంది, కాబట్టి దీనిని తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.

5 / 5
దోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అలాగే జీర్ణ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపు సమస్యలు దరిచేరవు. అందుకే కీర దోసను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. (గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి)