
Mercury and Saturn Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు తరచూ తమ రాశులను, నక్షాత్రాలను మారుస్తూ ఉంటాయి. ఇలా మార్పులు జరిగే క్రమంలో కొన్ని గ్రహాల సంయోగం కూడా జరుగుతుంది. దీంతో ఈ ప్రభావం పలు రాశులపై పడి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం బుధుడు-శని కలయికతో దశంక యోగం ఏర్పడుతోంది. బుధుడిని తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్ కారకంగా పరిగణిస్తారు.

అయితే, శనిని కర్మ, సహనం, కృషికి కారకంగా పరిగణిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న మంగళవారంనాడు బుధుడు, శని ఒకదానికొకటి 36 డిగ్రీల కోణీయ దూరంలో దశంక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభ కలయికగా పేర్కొంటున్నారు. ఈ కలయిక వల్ల ఏ నాలుగు రాశులు గొప్పగా ప్రయోజనం పొందుతాయో, వారి జీవితాల్లో ఎలాంటి సానుకూల మార్పులను అనుభవిస్తారో తెలుసుకుందాం.

మిథునరాశి బుధుడు, శని కలయిక వల్ల మిథున రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. వారు తమ జీవితంలో గొప్ప విజయాలను అందుకుంటారు. వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు భారీ లాభాలను అందిస్తాయి. పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వ్యక్తులు తమ పని ద్వారా తెలివితేటలు, కృషిని ప్రదర్శించడం ద్వారా విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు వారు గణనీయమైన అప్పులను తిరిగి చెల్లించడానికి వీలు కల్పిస్తాయి.

సింహ రాశి బుధ-శని సంయోగంతో సింహరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వారి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పనిలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. దీంతో వారికి గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యాపార వ్యూహాలు గణనీయమైన ఆర్థిక లాభాలకు దారితీస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు.

మకర రాశి బుధ-శని సంయోగంతో మకర రాశి వారికి ఆర్థిక లాభాలను తెస్తుంది. చేస్తున్న వ్యాపారంలో గణనీయమైన లాభాలు పొందుతారు. వారు పాత ప్రాజెక్టులపై పనిని తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలను ఆత్మవిశ్వాసంతో తీసుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కుంభ రాశి శక్తివంతమైన బుధ-శని సంయోగం కుంభరాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. మీరు అన్ని పనులను తెలివిగా పూర్తి చేస్తారు. ఓర్పుతో ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. వ్యాపారానికి కృషితోపాటు తెలివితేటలు చూపించి లాభాలను అందుకుంటారు. మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. (Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.)