కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఎంతో ప్రయత్నం మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ బాగాపెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు దూరప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.