AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరివేపాకు మటన్ లివర్ ఫ్రై.. ఇలా చేస్తే అబ్బో లొట్టలేసుకొని మరి తింటారు!

మటన్ లివర్ ఫ్రై అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ముఖ్యంగా పెద్ద వారు చాలా ఇష్టంగా తినే నాన్ వెజ్ రిసిపీలో ఇదే ముందుంటుంది. అయితే రెగ్యులర్‌గా చేసుకునేలా కాకుండా, కరివేపాకుతో మటన్ లివర్ ఫ్రై ఇలా వండితే చాలా అద్భుతంగా ఉంటుందంట. కాగా, దీనిని ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 30, 2026 | 11:31 AM

Share
కావాల్సిన పదార్థాలు :  మటన్ లివర్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, పచ్చి మిర్చి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పూదీనా, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మటన్ లివర్ తీసుకొని దానిని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చిటికెడు పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, బాగా  కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుప్పెడు కరివేపాకు తీసుకొని దానిని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసుకోవాలి. తర్వాత అందులో పచ్చి మిర్చీ, లవంగాలు, బిర్యానీ ఆకు, చాలా చిన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి  బాగా వేగిన తర్వాత అందులో అల్లం వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు అల్లం వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా మ్యారినెట్ చేసి పక్కన పెట్టుకున్న లివర్ వేసుకోవాలి.

3 / 5
లివర్ ప్రైని మంచిగా వేయించుకోవాలి. అలాగే అందులో కరివేపాకు వేసి వేయించుకోవాలి. అది బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరో ఐదు నుంచి పది నిమిషాల పాటు వేయించుకోవాలి. దీని వలన ముక్కలకు మంచిగా కారం పట్టి, తిన్నా కొద్ది టేస్ట్ చాలా అద్భుతంగా వస్తుంది.

4 / 5
అయితే ఇక మటన్ మంచిగా ఫ్రై అయ్యే లోపు గుప్పెడు కరివేపాకు తీసుకొని వేయించి పొడి చేసుకోవాలి.  తర్వాత లివర్ ఫ్రైలో ఈ పొడి వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తక్కువ మంటపై బాగా కలుపుతూ వేయించుకోవాలి. అంతే తర్వాత కొత్తిమీర, పూదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసి, పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కరివేపాకు మటన్ లివర్ ఫ్రై రెడీ.

5 / 5
Follow Us