
జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని వినియోగించిన సరైన ఫలితాలు పొందలేకపోతున్నారు.. అయితే కరివేపాకుతో తయారు చేసిన ఓ అద్భుతమైన రెసిపీ జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. కరివేపాకుతో తయారు చేసిన ఈ పొడిని రోజు ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జుట్టు సమస్యలను నివారించేందకు కరివేపాకు ఉపయోగపడుతుంది. కరివేపాకు పొడిని తినడం వల్ల శరీరానికి కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా అందుతాయి. కరివేపాకు పొడిలో విటమిన్ ఇ, విటమిన్ బి కాంప్లెక్స్, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, ఫోలెట్, విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తాయి.

కరివేపాకు పొడి తినడం వల్ల జుట్టు దృఢంగా తయారవుతుంది. పోయిన జుట్టు కూడా తిరిగి వస్తుంది. కరివేపాకు పొడిని నూనెలో కలిపి జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది, చుండ్రు తగ్గుతుంది. కరివేపాకు పొడిని ఫేస్ ప్యాక్‌లలో ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది.

కరివేపాకు కారం పొడి జీర్ణక్రియకు మంచిది. ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. కరివేపాకు పొడిని మరింత రుచికరంగా చేయడానికి, మీరు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు.

కరివేపాకు జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. కరివేపాకులో ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరుస్తుంది. కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి బరువు తగ్గిస్తుంది. యాబెటిస్, అతిసారం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను నియంత్రిస్తుంది.