- Telugu News Photo Gallery Cricket photos What Is BCCI's Net Worth? Indian Board Is 28 Times Higher Than Cricket Australia Says Reports
BCCI: క్రికెట్ పెద్దన్న బీసీసీఐ ఆస్తుల విలువ ఎంతో తెల్సా.? లెక్కలు చూస్తే షాకే
దేశంలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టెస్ట్, వన్డే, టీ20 ఇలా ఫార్మాట్ ఏదైనా కూడా స్టేడియాలు ఫ్యాన్స్‌తో ఫుల్ హౌస్ అవ్వాల్సిందే. మరికొందరైతే మ్యాచ్ వచ్చినంతసేపు అతుక్కుపోతుంటారు.
Updated on: Jul 25, 2024 | 10:57 AM

దేశంలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టెస్ట్, వన్డే, టీ20 ఇలా ఫార్మాట్ ఏదైనా కూడా స్టేడియాలు ఫ్యాన్స్‌తో ఫుల్ హౌస్ అవ్వాల్సిందే. మరికొందరైతే మ్యాచ్ వచ్చినంతసేపు అతుక్కుపోతుంటారు. ఈ క్రేజే బీసీసీఐకి కాసులు కురిపిస్తోంది. దీంతోనే బీసీసీఐ.. పెద్దన్నగా మారి క్రికెట్‌ను ఏలుతోంది.

మరి క్రికెట్ పెద్దన్న బీసీసీఐ నికర ఆస్తుల వివరాలు ఏంటి.? బోర్డుకు ఎన్ని మార్గాల్లో సంపాదన వస్తుంది. లెక్కలు చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఇతర క్రికెట్ బోర్డుల ఆదాయం.. బీసీసీఐకి సగం కంటే తక్కువేనని చెప్పాలి.

ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. బీసీసీఐ నికర ఆస్తుల వివరాలు 2.25 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ. 19 వేల కోట్లు. ఇందులో ఐపీఎల్ నుంచి రూ. 2,500 కోట్లు, ఇతర దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌ల నుంచి రూ.950 కోట్లు వస్తాయట.

అటు గతేడాది టీవీ, ఇంటర్నెట్ హక్కులతో కలిపి డీల్ ఫైనల్ చేస్తే.. ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఏటా రూ. 9768 కోట్లు వస్తోందట. అలాగే బీసీసీఐకి స్పాన్సర్‌షిప్ హక్కుల ద్వారా మంచి ఆదాయం వస్తుంది. 2023-2027 వరకు స్పోర్ట్స్ 18, జియో సినిమా బీసీసీఐకి అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్‌లు. 2022–2023 ఐపీఎల్ సీజన్, మహిళల ప్రీమియర్ లీగ్‌కు టాటా గ్రూప్ స్పాన్సర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

టికెటింగ్ హక్కులు, మర్చెండైస్ సేల్ బీసీసీఐకి మరో ఆదాయ వనరు. బుక్‌మైషో, పేటీఎం లాంటి టిక్కెటింగ్ యాప్స్.. బోర్డుకి భారీగా డబ్బు చెల్లిస్తుంది. క్రికెటర్లు సంతకాలు చేసిన బాల్స్, బ్యాట్స్, టీమ్ షర్టులు, ఇతర వస్తువుల విక్రయం ద్వారా కూడా బీసీసీఐ డబ్బును ఆర్జిస్తుంది.




