- Telugu News Photo Gallery Cricket photos Teamindia former captain Ms dhoni take care of his knee with vaidya near ranchi
మారుమూల గ్రామంలో.. రూ. 40ల ఫీజుతో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ధోని.. అసలు విషయం ఏంటంటే?
అయితే, ఈసారి అతను తన వ్యాధి గురించి చర్చల్లో నిలిచాడు. ఈ వ్యాధితో ధోని గత నెల రోజులుగా ఆందోళన చెందుతున్నాడు.
Updated on: Jun 30, 2022 | 3:16 PM

IPL 2022లో చెన్నై ప్రయాణం ముగిసినప్పటి నుంచి ఎంఎస్ ధోని తన నగరం రాంచీలో సందడి చేస్తున్నాడు. చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాుడ. ధోనీ తన పాత స్నేహితులను కలుస్తూ, వారితో పార్టీలకు హాజరు అవుతున్నాడు. ఇటీవల, ధోనీ స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఈసారి అతను తన వ్యాధి గురించి చర్చల్లో నిలిచాడు. ఈ వ్యాధితో ధోని గత నెల రోజులుగా ఆందోళన చెందుతున్నాడు.

ధోని అనారోగ్యం సమస్య వాస్తవానికి ఆయన మోకాలి నొప్పికి సంబంధించినది. ఈ క్రమంలో పెద్ద డాక్టర్‌కు చూపించుకోకుండా, కేవలం నాటు వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్నాడు. ఇది కూడా ధోని సింప్లిసిటీకి నిదర్శనం అంటున్నారు ఫ్యాన్స్.

మోకాళ్ల నొప్పుల చికిత్స కోసం ధోని ప్రతి 4 రోజులకు ఒకసారి నాటు వైద్యుడిని కలుస్తుననాడంట. అయితే, ఇందుకు ధోని చెల్లిస్తున్న ఫీజు కేవలం రూ.40 మాత్రమే కావడం విశేషం.

రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలోని లాపుంగ్‌లోని కటింగ్‌కెలా బాబా గల్గాలీ ధామ్‌లో వందన్ సింగ్ ఖేర్వార్ వద్ద ధోనీ చికిత్స పొందుతున్నాడు. గత నెల రోజులుగా ధోని ప్రతి 4 రోజులకు తన వద్దకు వస్తున్నాడని, హెర్బల్ మెడిసిన్‌తో చికిత్స పొందుతున్నాడని వందన్ చెప్పుకొచ్చాడు.

ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. కానీ, ఐపీఎల్‌లో మాత్రం తన దూకుడు ఇంకా తగ్గలేదు. ఇటువంటి పరిస్థితిలో ఐపీఎల్ 2023కి ముందు, అతని మోకాళ్ల నొప్పి పూర్తిగా నయం కావాలని, అభిమానులు కోరుకుంటున్నారు. ధోనిని మైదానంలో చూడాలని వారు కోరుకుంటున్నారు.




