- Telugu News Photo Gallery Cricket photos Sunrisers Hyderabads IPL 2026 Mini Auction Strategy: Player Releases and Retentions.. Heinrich Klaasen In Focus
SRH: మేడమ్ సార్.. మేడమ్ అంతే! ఆ 3గురి ప్లేయర్స్‌కి పింక్ స్లిప్.. కావ్యపాప మంచిపని చేసేసిందిగా
సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL 2026 మినీ వేలం కోసం వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్‌లను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. వీరితో పాటు క్లాసెన్‌పై కూడా వేటు వేయనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Updated on: Nov 05, 2025 | 7:20 AM

IPL 2026 మినీ వేలం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యూహాలు సిద్దం చేస్తోంది. నవంబర్ 15వ తేదీ రిటెన్షన్, రిలీజ్ లిస్టులకు లాస్ట్ డే కావడంతో భవిష్యత్తు ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్ళకు పెద్ద పీట వేస్తోంది. ఇక డిసెంబర్ 15న మినీ వేలం జరిగే అవకాశం ఉంది.

గత IPL సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌లకు చేరలేకపోవడానికి ప్రధాన కారణం కొందరు ప్రముఖ ప్లేయర్స్ నిరాశజనక ప్రదర్శన అని తెలుస్తోంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లపై వేటు వేసేందుకు SRH నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేస్ బౌలర్ మహమ్మద్ షమీ. అతడిని రూ. 10 కోట్లకు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసినప్పటికీ.. అంచనాలు అందుకోలేకపోయాడు. గాయాల బెడదతో ఫామ్ కోల్పోయాడు. ఇక మిడిలార్డర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా జట్టుకు భారంగా మారాడు. అతడ్ని రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేస్తే.. ఒకట్రెండు మ్యాచ్‌లు మినహా మిగిలిన అన్నింటిలోనూ ఫెయిల్ అయ్యాడు.

ఇక స్పిన్ విభాగంలో రాహుల్ చాహర్. జట్టుకు ఒక మంచి స్పిన్నర్ అవసరమని భావించి రూ.3.20 కోట్లకు అతడ్ని కొనుగోలు చేస్తే.. ఆడిన మ్యాచ్‌లు కేవలం ఒకట్రెండు మాత్రమే. అందుకే డబ్బును ఆదా చేసేందుకు పర్స్ గట్టిగా పెట్టుకునేందుకు ఈ ముగ్గురిని విడుదల చేయాలని హైదరాబాద్ యాజమాన్యం భావిస్తోంది.

వీరితో పాటు ఆ జట్టు ప్రధాన బ్యాటర్ హేన్రిచ్ క్లాసెన్(రూ. 23 కోట్లు)ను కూడా రిలీజ్ చేస్తుందట SRH. ఎక్కువ ధర ఉండటంతో అతడ్ని రిలీజ్ చేసి.. మళ్లీ వేలంలో రీ-బిడ్‌కు వెళ్లనుందని టాక్. ఏది ఏమైనా పర్స్ వాల్యూ సుమారు రూ. 40 కోట్ల వరకు అట్టిపెట్టుకుని.. మినీ ఆక్షన్‌లోకి వెళ్లనుంది SRH




