uppula Raju |
Mar 30, 2022 | 12:10 PM
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. కానీ లాహోర్ పిచ్‌పై తన 57 పరుగుల ఇన్నింగ్స్‌తో ప్రపంచ దిగ్గజ బ్యాట్స్‌మెన్లని వెనకకి నెట్టేశాడు. విడిచిపెట్టాడు. అది ఎలాగో తెలుసుకుందాం.
బాబర్ ఆజం ఆస్ట్రేలియాపై 15 పరుగులు చేసిన వెంటనే ODI క్రికెట్‌లో వేగంగా 4000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సందర్భంగా అతను వివ్ రిచర్డ్స్ నుంచి విరాట్ కోహ్లీ వరకు, స్టీవ్ స్మిత్ నుంచి జో రూట్ వరకు అందరినీ వెనక్కి నెట్టేశాడు.
పురుషుల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా.. బాబర్ అజామ్ కంటే ముందున్నాడు. ఆమ్లా 81 వన్డేల్లో ఈ ఫీట్ చేయగా బాబర్ 82 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది.
వివ్ రిచర్డ్స్ 86 ఇన్నింగ్స్‌లలో 4000 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు జో రూట్ వన్డే క్రికెట్‌లో 91వ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించాడు. విరాట్ కోహ్లీ 93 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో వేగంగా 4000 పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్‌లలో విరాట్ కోహ్లీ 5వ స్థానంలో ఉన్నాడు.