- Telugu News Photo Gallery Cricket photos PAK vs ENG: Kamran Ghulam Hits Record Breaking Century against England 2nd Test Multan Cricket Stadium
PAK vs ENG: బాబర్ ప్లేస్‌లో 29 ఏళ్ల ప్లేయర్‌కు లక్కీ ఛాన్స్.. కట్‌చేస్తే.. తొలి సెంచరీతో బీభత్సం
Kamran Ghulam Records: గత 18 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క అర్ధ సెంచరీ చేసిన బాబర్ ఆజం పాకిస్థాన్ టెస్టు జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో అరంగేట్రం చేసిన 29 ఏళ్ల కమ్రాన్ గులామ్ హాట్ టాపిక్‌గా మారాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీతోపాటు ఎన్నో రికార్డులు సృష్టించాడు.
Updated on: Oct 16, 2024 | 1:49 PM

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ స్థానంలోకి వచ్చిన కమ్రాన్ గులామ్ తన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. అది కూడా బలమైన ఇంగ్లండ్ పేసర్లను ఎదుర్కోవడం విశేషం. ముల్తాన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కేవలం 7 పరుగుల వద్ద ఔట్ కాగా, మూడో స్థానంలో వచ్చిన షాన్ మసూద్ 3 పరుగులకే వికెట్ కోల్పోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కమ్రాన్ గులామ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇంగ్లండ్ బౌలర్లను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్న కమ్రాన్ 192 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో పాకిస్థాన్ తరపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన 13వ ఆటగాడిగా నిలిచాడు. అలాగే, తొలి మ్యాచ్‌లో నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించిన రెండో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

అతను తన అరంగేట్రం మ్యాచ్‌లో నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేయడం ద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో సెంచరీ సాధించిన ప్రపంచంలోని 6వ బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు. అంతేకాకుండా, తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన పాక్ రెండో ఆటగాడిగా నిలిచాడు. కమ్రాన్ గులామ్ 29 ఏళ్ల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌లో కమ్రాన్ గులామ్ 224 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 118 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో పాక్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఇక రెండో రోజు లంచ్ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 358 పరుగులు సాధించింది.




